కిల్లర్ ఛేజర్ ‘విక్రాంత్ రోణ’

కిల్లర్ ఛేజర్ ‘విక్రాంత్ రోణ’

చిత్రం : విక్రాంత్ రోణ‌
విడుదల తేదీ : జూలై 28, 2022
నటీనటులు : కిచ్చా సుదీప్, నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వలిన్ ఫెర్నాండేజ్, రవిశంకర్ గౌడ, మధుసూదన్ రావు తదితరులు
సంగీతం : బి అజనీష్ లోక్‌నాథ్‌
నిర్మాతలు : జాక్ మంజునాథ్‌‌, శాలిని మంజునాథ్
రచన, దర్శకత్వం : అనూప్ భండారి

టాలీవుడ్ లో విల‌న్ ఇమేజ్ తెచ్చుకున్న కిచ్చా సుదీప్ క‌న్న‌డ‌లో స్టార్ హీరోగా అందరికి సుపరిచితమే. కన్నడలో త‌న‌కంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకొన్నాడు. తాజాగా కిచ్చా సుదీప్ త‌న కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్ సినిమా ఒక‌టి చేశాడు. అదే 'విక్రాంత్ రోణ‌' వీ.ఆర్ పేరుతో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇవాళ ఈ మూవీ గ్రాండ్ గా రీలీజ్ అయ్యింది. మ‌రి ఈ వీ.ఆర్ ఎలా ఉంది? ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో తెలుసుకుందాం..

కథ:
1960,1970 సంవత్సరాల కాలంలో జరిగే ఈ పీరియాడిక్ స్టోరీలోకి వెళితే.. ఓ అటవీ ప్రాంతంలోని కొమరొట్టు అనే గ్రామం.. అక్కడ ఒక ఇంట్లో భయంకరమైన రాక్షసుడు ఉన్నాడని.. అక్కడికి వచ్చిన వారిని చంపేస్తాడని ఊర్లోవారందరు నమ్ముతుంటారు. అందుకు తగ్గట్టే అక్కడ హత్యలు జరుగుతుంటాయి. అలాగే చిన్న పిల్లలు కూడా అడవిలో చెట్లకు శవాలుగా వేలాడుతుంటారు. అయితే కేసు ఇన్వెస్టిగేషన్ కు వచ్చిన పోలీస్ ఆఫీసర్ కూడా మర్డర్ కు గురి అవుతాడు. ఈ ఆఫీసర్ స్థానంలోకి విక్రాంత్ రోణ వస్తాడు. మరి కిల్లర్ ను విక్రాంత్ పట్టుకున్నాడా? ఈ హత్యలకు కారణం ఏంటి అన్నది మూవీ స్టోరీ.

టెక్నికల్ విషయానికొస్తే.. 
మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. విజువల్ గా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రాఫర్ గా విలియమ్ డేవిడ్ ప్రతిభ చూపెట్టాడు. అలాగే బి.అజనీష్‌ లోక్‌నాథ్‌ అందించిన బ్యాంక్ గ్రౌండ్ స్కోరు సీన్స్ కు తగ్గట్టుగా ఇంట్రస్ట్ క్రియేట్ చేసింది. పాటలు మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు.

నటీనటుల విషయానికి వస్తే.. 
కిచ్చ సుదీప్ యాక్షన్ సీన్స్ తో పాటుసెంటిమెంట్ సీన్స్ లో మంచి నటన ప్రదర్శించాడు. పైట్స్ సన్నివేశాలతో తన అభిమానులను అలరించాడు. లుక్ తో కూడా మెప్పించాడు. నిరూప్ భండారి, నీతా అశోక్, రవిశంకర్ గౌడ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పెషల్ సాంగ్ లో మెరిసింది.

ప్లస్సులూ మైనస్సులూ..
విక్రాంత్ రోణలో థ్రిల్ చేసే అంశాలను యాక్షన్స్ సీన్స్ తగ్గించేశాయి. కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ ఇంటర్వెల్ బ్యాంగ్ అలాగే ఫ్యాన్స్ ను టార్గెట్ చేసి కిచ్చ సుదీప్ చేసిన ఫైటింగ్ సన్నివేశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. దర్శకుడు అనూప్ భండారి తాను అనుకున్న స్టోరీని ఇంట్రస్టింగ్ గా నెరేట్ చేయలేకపోయాడు. తర్వాత ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ పెంచలేకపోయాడు. ఎక్స్ పెక్ట్ చేయని క్లైమాక్స్ కోసం ప్రేక్షకులు ఏ మాత్రం అనుమానించని వ్యక్తిని హంతకుడిగా తెల్చేయటం డిసప్పాయింట్ చేస్తుంది. ఈ హత్యలు సైకో కిల్లర్ చేసే హత్యలు లాగే అనిపిస్తాయి తప్పా తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి రివేంజ్ ల అనిపించవు. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఓటీటీలో చూసేయొచ్చు.  

కొసమెరుపు : విక్రాంత్ రోణ కిచ్చ సుదీప్ అభిమానులకు మాత్రమే..