తప్పతాగి క్లాస్ రూంకు వచ్చిన టీచర్..ఏంచేశాడంటే

తప్పతాగి క్లాస్ రూంకు వచ్చిన టీచర్..ఏంచేశాడంటే

కుమ్రం భీం ఆసిఫాబాద్: విద్యాబుద్దులు నేర్పి విద్యార్థులను సరియైన మార్గంలో పెట్టాల్సి ఉపాధ్యాయుడు తానే దారి తప్పాడు..పిల్లలకు చదువు చెప్పమని ఉద్యోగం ఇస్తే తప్పతాగిపడుకున్నాడు. విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడు..అభాసు పాలయ్యాడు. విధులను నిర్లక్ష్యం చేసి సస్పెన్షన్ కు గురయ్యారు. వివరాల్లోకి వెళితే..   

ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం సుకుత్ పల్లిలోని ఏహెచ్ఎస్ పాఠశాలలో ఈఘటన చోటు చేసుకుంది. ఎస్‌జిటిగా విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుడు విలాస్ మద్యం తాగి స్కూల్ కు వచ్చాడు. క్లాస్ రూంలో తూలుతూ పడిపోయాడు. ఇది చూసిన విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. 

విషయం తెలుసుకున్న విద్యార్థుల పేరెంట్స్, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.  పిల్లల భవిష్యత్తును సరియైన మార్గంలో పెట్టాల్సిన ఉపాధ్యాయుడే ఇలా నిర్లక్ష్యంగా ఉండటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. 

ఈ ఘటనపై ఫిర్యాదు అందిన వెంటనే, ఆసిఫాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రమాదేవి విచారణకు ఆదేశించారు. విచారణలో ఉపాధ్యాయుడు విలాస్ తప్పతాగి విధులకు వచ్చినట్లు తేలింది. విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన టీచర్ ఇలా బాధ్యతారాహిత్యంగా ఉండటంపై అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. విధులను నిర్లక్ష్యం చేసినందుకు విలాస్‌ను సస్పెండ్ చేస్తూ రమాదేవి ఆదేశాలు జారీ చేశారు.