e KYC  కోసం గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు.. ఎవరికంటే

e KYC  కోసం గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు.. ఎవరికంటే

దేశ వ్యాప్తంగా రైతులకు  ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా ప్రస్తుతం ఏడాదికి రూ. 6 వేల రూపాయిలు అందిస్తుంది.  అయితే ఈ పథకం వర్తించాలంటే తప్పకుండా  e KYC  ప్రక్రియ పూర్తి చేయాలి . దేశ వ్యాప్తంగా e KYC  పూర్తి చేయని రైతుల కోసం ఫిబ్రవరి 12 నుంచి 21 వరకు ప్రతి గ్రామంలో క్యాంపులు నిర్వహిస్తున్నారు.   అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన గురించి రైతులకు అవగాహన కల్పించారు.  అయినా చాలా మంది రైతులు ఈ పథకం లబ్ధి పొందలేకపోతున్నారు.  ఈ పథకం ప్రారంభమైన దగ్గరి నుంచి పలు మార్లు నియమ నిబంధనలను పాటించడంలో మార్పులు చేశారు. PM కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజనాలను పొందేందుకు, e-KYC  తప్పనిసరి కేంద్రప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. చాలామంది రైతులు e -KYC గురించి అవగాహన లేకపోవడంతో సమయానికి పూర్తి చేయలేకపోతున్నారు.  ఇలాంటి రైతుల సమస్యను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇప్పుడు ప్రతి గ్రామంలో  e- KYC క్యాంపులు నిర్వహిస్తున్నారు. 

ఈ-కెవైసి ప్రక్రియ రైతులు ఈ-కేవైసీ చేయాలని ప్రభుత్వం చాలా కాలంగా పట్టుబట్టుతోంది. అయినప్పటికీ చాలామంది రైతులు దీనిని పట్టించుకోవడం లేదు. నిబంధనల ప్రకారం ప్రతి లబ్ధిదారుడు e-KYC ప్రక్రియను పూర్తి చేయాలి. అలా చేయకుంటే అర్హులైన రైతుకు ఆర్థిక సాయం అందకుండా పోయే అవకాశం ఉంది. e-KYC ప్రక్రియను పూర్తి చేయడానికి మీరు సమీప CSC కేంద్రానికి వెళ్లి ప్రక్రియను పూర్తి చేయవచ్చు. PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ద్వారా కూడా KYC చేయవచ్చు.

ALSO READ :- అందెశ్రీకి పదవి ఇస్తం .. ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి

ల్యాండ్ వెరిఫికేషన్  పని ఇంకా పూర్తి కాకపోతే ఇన్‌స్టాల్‌మెంట్స్‌ ఆగిపోతాయి. ఈ స్కీం కింద ప్రతి రైతు భూమిని సరిచూసుకోవడం తప్పనిసరి. మీరు ఇచ్చిన బ్యాంక్ ఖాతా సమాచారం తప్పుగా ఉన్నప్పటికీ మీరు ఇన్‌స్టాల్‌మెంట్‌ను కోల్పోతారు. కాబట్టి రైతులు  ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండాలి. దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా పీఎం కిసాన్‌ ఇన్‌స్టాల్‌ మెంట్‌ రెగ్యులర్‌గా అకౌంట్‌లో జమ అవుతాయి.