బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును అడ్డుకున్న గ్రామస్తులు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును అడ్డుకున్న గ్రామస్తులు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు నిరసన సెగ తగిలింది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం ఎల్మపల్లి గ్రామంలో గువ్వల బాలరాజును గ్రామస్తులు అడ్డుకున్నారు.  గ్రామంలో ఇప్పటి వరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చెయ్యలేదని నిలదీశారు.  దళిత బందు ఇప్పిస్తా, గ్రామానికి నిధులు తెస్తా, అభివృద్ధి చేస్తా అంటూ  ప్రజలను మభ్యపెట్టారని ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గువ్వల బాలరాజుకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని గ్రామస్తులను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే బాలరాజును అక్కడి నుంచి తీసుకెళ్లారు పోలీసులు.