శ్మశానవాటిక కోసం గ్రామాల మధ్య ఫైటింగ్

శ్మశానవాటిక కోసం గ్రామాల మధ్య ఫైటింగ్
  • ఆర్డీఓ ఆఫీస్‌ ముందు రాంపల్లి దాయరా గ్రామస్తుల ధర్నా

Village People and Sarpanch Fighting For Cemetery Landకీసర, వెలుగు: కీసర మండలం రాంపల్లి దాయరా, గోధుమకుంట గ్రామాల మధ్య శ్మశానవాటిక భూమి విషయం  వివాదాస్పదమైంది. రాంపల్లి దాయరా పంచాయతీ పాలకవర్గం పక్క గ్రామమైన గోధుమకుంట గ్రామానికి తమ గ్రామంలో శ్మశానవాటిక కొరకు భూమి కేటాయించడం సరికాదని గురువారం ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కీసర మండలం రాంపల్లి దాయరా రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 455 లో గత ప్రభుత్వాలు ఆ గ్రామానికి చెందిన పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చారు. ఆ గ్రామానికి చెందిన స్థలంలో రాంపల్లి దాయరాగ్రామ ప్రజలు స్మశానవాటిక ఏర్పాటు చేసుకున్నారు. 2017లో మండల తహసీల్దార్, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్‌‌ను కలిసి గోధుమకుంట గ్రామానికి కూడా అక్కడే స్మశానవాటిక స్థలాన్ని కేటాయించారు. గోధుమకుంట సర్పంచ్ అకిటి మహేందర్, ప్రజాప్రతినిధులు రాంపల్లి దాయారా రెవెన్యూ పరిధిలో ఉన్న స్మశానవాటిక స్థలాన్ని జేసీబీతో చదును చేశారు.

ఈ విషయం తెలుసుకున్న రాంపల్లి దాయరా సర్పంచ్ గురుగుల అండాలు పంచాయతీ సభ్యులు గ్రామ ప్రజలు సంఘటన స్థలానికి వచ్చి గోధుమకుంట గ్రామస్థులను అడ్డగించారు. దీంతో రాంపల్లి దాయరా, గోధుమకుంట గ్రామాల మధ్య వాగ్వాదం జరిగింది. రాంపల్లి దాయరా సర్పంచ్ గురుగుల అండాలు మాట్లాడుతూ గోధుమకుంట గ్రామంలో ప్రభుత్వ భూమి ఉన్నా మా గ్రామంలో శ్మశానవాటిక కొరకు భూమి అడగడం సరికాదన్నారు. గోధుమకుంట గ్రామంలో సర్వే నెంబర్ 15 లో 39 ఎకరాలు, 163 లో 1.24 ఎకరాలు, 163 పార్ట్ లో 30 గుంటల భూమి ఉందని ఆర్డీఓ లచ్చిరెడ్డికి గ్రామస్థులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, ముక్క మహేందర్, మాజీ సర్పంచ్ గాంగి మల్లేష్ గ్రామస్థులు పాల్గొన్నారు.