
హుజురాబాద్ మండలం రాంపూర్ లో మాజీ మంత్రి ఎల్. రమణ.. టీఆర్ఎస్ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. గ్రామంలోని చేనేత కార్మికులతో సమావేశం తర్వాత ఎల్. రమణను చుట్టుముట్టారు గ్రామస్థులు. ఏడేళ్లలో ఒక్క నౌకరన్నా ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. పద్మశాలీల, నేతల కార్మికుల బాధలను పట్టించుకోవడం లేదంటూ నిలదీశారు.