అలా రోడ్డు వేశారో లేదో.. లూటీ చేశారు.. 3కిలోమీటర్ల రోడ్డును మాయం చేశారు

అలా రోడ్డు వేశారో లేదో.. లూటీ చేశారు.. 3కిలోమీటర్ల రోడ్డును మాయం చేశారు

దొంగతనాల్లో చాలా రకాలు విన్నాం.. కొందరు గోల్డ్ చోరీ చేస్తే.. మరికొందరు డబ్బు దొంగతనం చేస్తారు. ఇంకొందరు విలాసవంతమైన వస్తువులు చోరీ చేస్తారు. కానీ.. రోడ్డును దొంగతనం చేయడం మీరు ఎప్పుడైనా చూశారా..? విన్నారా...? బీహార్ లో అదే జరిగింది. ఏకంగా రోడ్డునే ఎత్తుకెళ్లారు గ్రామస్తులు. దీని గురించి తెలుసుకోవాలంటే బీహార్ కు వెళ్లాల్సిందే..!

జహానాబాద్ ​జిల్లాలోని ఔదాన్ గ్రామంలో ఇటీవల రోడ్డు వేశారు. ముఖ్యమంత్రి సడక్ గ్రామ్ యోజన పథకం క్రింద గ్రామంలో కొత్తగా రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. ఈ రోడ్డు నిర్మాణ పనులను మూడు నెలల క్రితమే స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించారు.

రోడ్డు వేశాక అక్కడికి స్థానికులు కొంతమంది వచ్చారు. రోడ్డును తవ్వుకుంటూ ఎత్తుకెళ్లారు. ఏకంగా మూడు కిలోమీటర్ల మేర రోడ్డును లూటీ చేసేశారు. అంతేకాదు.. రహదారి నిర్మాణం కోసం అక్కడ ఉంచిన సామాగ్రిని కూడా తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేశారు.