
సూర్యాపేట జిల్లా దొండపాడులో ఫార్మా కంపెనీ కోసం ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రికత్తంగా మారింది. కంపెనీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు నిరసన తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించి.. అక్కడి కుర్చీలు విరగొట్టి ఆందోళనకు దిగారు. ఇప్పటికే గ్రామంలో జూవారి సిమెంట్, మైలాన్ , రాకిమ్ కెమికల్ ఫ్యాక్టరీలతో .. భూగర్భ జలాలు కలుషితమయ్యాయని, సిమెంట్ ఫ్యాక్టరీలతో వాయు కలుష్యం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో SRR ..SGR ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయొద్దని కోరారు. గ్రామంలో కంపెనీలు ఏర్పాటు చేస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు.