మురిమడుగుకు పల్లె దవాఖాన మంజూరు చేయాలి : గ్రామస్తులు

మురిమడుగుకు పల్లె దవాఖాన మంజూరు చేయాలి :  గ్రామస్తులు

జన్నారం, వెలుగు: మురిమడుగు గ్రామానికి పల్లె దవాఖాన మంజూరు చేయాలని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు శుక్రవారం తహసీల్దార్ రాజమనోహర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.

 మురిమడుగు చుట్టుపక్కల ఐదు గిరిజన గ్రామాలున్నాయని, ప్రజలు వైద్యం కోసం ఎటు వెళ్లినా సుమారు10 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జగన్, దినేశ్, రవీందర్, లచ్చయ్య, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.