ఖమ్మం ఒకటో డివిజన్ లో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆ ప్రాంతంలోని ఆనంద్ అనే యువకుడు ఇటీవల మరణించాడు. అయితే ఆ యువకుడి మృతికి డివిజన్ కార్పొరేటర్ రామ్మూర్తి నాయక్ కారణమని యువకుడి బంధువులతో పాటు కైకొండాయి గూడెం గ్రామస్థులు దాడి చేశారు. అతడు ప్రయాణిస్తున్న కారును ధ్వంసం చేశారు. దీంతో కార్పొరేటర్ ప్రాణభయంతో పారిపోయి ప్రభుత్వ పాఠశాలలో దాక్కొన్నాడు. గ్రామస్థులు అతని కారును తగులబెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

