
వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలోని ఊళ్లలో నిధుల వరద పారనుంది. కేం ద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘాలు, ఉపాధి హామీ పథకం, పన్నులు ఇలా వివిధ రూపాల్లో రానున్న ఐదేళ్లలో స్థానిక సంస్థలకు రూ.40 వేల కోట్లు రానున్నాయి. దీంతో గతంలో కంటే అభివృద్ధి పనులు ఊపందుకోనున్నాయి. మాజీ మంత్రి రాజేశంగౌడ్ చైర్మన్ గా ఏర్పాటైన రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పిం చింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు రూ.1,400 కోట్లు ఇవ్వాలని సూచించింది. అయితే తాజా బడ్జెట్లో రూ.1,627 కోట్లు ఇస్తామని సీఎం ప్రకటించారు.
14వ ఆర్థిక సంఘం నుంచి రూ.1,627 కోట్లు విడుదల కావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో మొత్తం రూ.3,254 కోట్లు స్థానిక సంస్థలకు రానున్నాయి. 2020 ఏప్రిల్ 1 నుంచి 15వ ఆర్థిక సంఘం అమల్లోకి రానుంది. రాష్ట్రాలు, స్థానిక సంస్థలకు ఇచ్చే నిధులపై కేంద్రానికి 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయనుంది. దీనిపై ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్ కే సింగ్ నేతృత్వం లోని టీమ్ అన్ని రాష్ట్రాల్ లో పర్యటిస్తోంది. గతానికి భిన్నం గా..గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లోకల్ బాడీలకు నిధుల కేటాయింపు, విడుదల సరిగ్గా ఉండేది కాదు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేంద్ర ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులకు అంతే మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని, అవసరమైతే ఇంకా నిధులు ఇచ్చేందుకు సిద్ధమని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
వీటితో గ్రామాల్లో కనీస సదుపాయాలైన రోడ్లు, తాగునీరు, వీధిలైట్లు, పారిశుధ్యం తో పాటు తాజాగా నర్సరీల ఏర్పాటు, స్మశాన వాటికలను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ప్రతి పంచాయతీకి బీటీ రోడ్డు సౌకర్యం కల్పించేలా పంచాయతీరాజ్, రోడ్లు, భవనాల శాఖ అధికారులు ప్రణాళికలు రెడీ చేశారు. బడ్జెట్ లో నిధులు కేటాయిం చటంతో టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యా ప్తంగా కొత్త, పాత పంచాయతీల్లో పకడ్బందీ గా పన్నులు వసూలు చేయాలని సీఎం కేసీఆర్ ఇటీవల అధికారులను ఆదేశించారు. మొత్తం పంచాయతీల నుంచి పన్నుల ద్వారా రూ.700 కోట్లు రావచ్చని అంచనా. పంచాయతీల్లో పన్ను వసూలు బాధ్యత సర్పంచ్, ఉప సర్పంచ్, కార్యదర్శులదే అని సీఎం స్పష్టం చేశారు. దీంతో రానున్న రోజుల్లో పన్నుల వసూలు మెరుగ్గా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.