దుమ్ము చంపేస్తోంది..కాలుష్యం కోరల్లో పల్లెలు

దుమ్ము చంపేస్తోంది..కాలుష్యం కోరల్లో పల్లెలు

సత్తుపల్లిలో 2003లో జలగం వెంగళరావు పేరిట ఓపెన్‌ కాస్ట్‌ గనిని సింగరేణి ప్రారంభించింది. 16 ఏళ్ళలో ఇక్కడ నాణ్యమైన బొగ్గును తీసి, కోట్లు సంపాదించింది. కానీ ఇక్కడి జనాల గోస మాత్రం పట్టించుకోవడంలేదు. ఓపెన్‌కాస్ట్‌ కావడంతో బాంబుపేలుళ్లతో ఈ ప్రాంతం దద్దరిల్లుతుంటుంది. వందల మీటర్ల వరకు మట్టి లేచిపడుతుండడంతోపాటు ఓపెన్‌కాస్ట్ నుంచి వచ్చే గాలి కాలుష్యం కలవరపెడుతుంది. ఓసీకి దగ్గరగా ఉన్న కిష్టారం, రేజర్ల , కొమ్మెపల్లి, సత్తుపల్లి పట్టణంలోని ఎన్​టీఆర్ కాలనీల ప్రజలు శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు. ఊపిరితిత్తులు, కిడ్నీ వ్యాధులతో గత 15 ఏండ్లలో ఒక్క కిష్టారంలోనే 210 మంది చనిపోయారు. సింగరేణి ఉత్పత్తి టార్గెట్ ను సాధించేందుకు కెపాసిటీకి మించి బ్లాస్టింగులు చేస్తుందని, దీంతో రోజుకు రెండుసార్లు భూమి కంపించినట్లు అనిపిస్తుందని స్థా నికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డేంజర్ జోన్ వై జంక్షన్…..

సత్తుపల్లి పట్టణ శివారులో హైవే మీద వై జంక్షన్​ డేంజర్ జోన్‌గా మారింది. సత్తుపల్లి నుంచి ఖమ్మం వైపు వెళ్ళే మార్గాన్ని మళ్లించి , సింగరేణి ఓసీ లో నుంచి వచ్చే దారిని కలిపే చోటే వై జంక్షన్. ఇది కిష్టారం గ్రామానికి దగ్గరగా ఉంటుం ది. ఇక్కడ ఒక మలుపు ఉండటం, బొగ్గు లారీల ఆఫీసులుండడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. సింగరేణి నుంచి వచ్చే బొగ్గు లారీలు, కొత్తగూడెం నుంచి ఓసీలోకి వెళ్లే ఖాళీ లారీలు, సత్తుపల్లి నుంచి ఖమ్మం వైపు వెళ్లే వాహనాలతో ఇక్కడ రద్దీ ఉంటుం ది. కానీ, రోడ్డు సెఫ్టీ ఇండికేటర్స్ కానీ, ట్రాఫిక్ కంట్రోలు చేసేవారు గానీ కనిపించరు. జంక్షన్​ నుంచి కిష్టారం చివరి వరకు బొగ్గు లారీల దుమ్ము, ధూళితో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. రోడ్డు పొడవునా ప్రతి రోజు దుమ్ము లేవకుండా సింగరేణి ట్యాంకర్ తో నీటిని కొట్టాలి కానీ సంస్థ ఆ పని చేయడంలేదు. సత్తుపల్లి ఓసీ నుంచి కొత్తగూడెం వరకు రెండు సంస్థలు రోజూ బొగ్గు రవాణా చేస్తుంటాయి. రోజుకిన్ని ట్రిప్పులు కొట్టాలని టార్గెట్‌ పెట్టడంతో డ్రైవర్లు అతివేగంగా వెళ్తుంటారు.సత్తుపల్లి, కిష్టారం, లంకపల్లి, మండాలపాడు, వీఎం బంజర, యడ్ల బంజర, యర్రగుంట, చండ్రుగొండ, కొత్తగూడెంలలో వందల మంది లారీల కింద పడి చనిపోయారు.

నిబంధనలు పట్టించుకోరు…

రోజుకు 400 లారీలు సత్తుపల్లి నుంచి పెనుబల్లి మీదిగా కొత్తగూడెం బొగ్గు తో వెళ్తుంటాయి. 12టన్నుల బరువున్న 14 టైర్ల లారీ 30 టన్నుల బొగ్గును మాత్రమే రవాణా చేయాలి. లారీలు 3 నుంచి 5 టన్నుల ఓవర్ లోడుతో రవాణా చేస్తుంటారు. 23 టన్నుల బొగ్గు ను రవాణా చేయాల్సిన 12 టైర్ల లారీలో 27 టన్నుల వరకు తరలిస్ తున్నా రు. ఓవర్ టన్నేజ్ తో పాటు అర్హతలేని డ్రైవర్లు మరో పెద్ద సమస్య. కనీస అర్హత, డ్రైవింగ్ లైసెన్స్ లేనివారిని కూడా బొగ్గు టిప్పర్లకు డ్రైవర్లుగా పెడుతున్నా రు. రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేసి న జాడలే లేవు. ఫలితంగా చాలామంది టిప్పర్లు ఢీకొని ప్రమాదాలకు గురవుతున్నా రు. బొగ్గు లోడు చేసి న తరువాత లారీకి పూర్తిగా కవర్లతో కప్పాలి . కానీ, చిరిగిన పట్టాలను లారీపై వేసుకొని బొగ్గు ను రవాణా చేస్తుంటారు. దీని వల్ల బొగ్గు లారీలకు వెనుకున్న వెహికిల్స్‌ మీద బొగ్గు పెల్లలు పడి జరిగిన ప్రమాదాలు లెక్కలేనన్ని . లారీ సంఘాల నుంచి భారీ ముడుపులందడం వల్లనే అక్రమాలను అధికారులు పట్టిం చుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఓవర్ లోడ్ ను, అనర్హులు డ్రైవింగ్‌ చేయడాన్ని అరికట్టడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.