నాడు నీట మునిగాయ్.. నేడు పైకి తేలాయ్

నాడు నీట మునిగాయ్.. నేడు పైకి తేలాయ్

గోదావరిఖని, వెలుగు: రామగుండం నియోజకవర్గంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముంపునకు గురైన మూర్మూర్, ఎల్లంపల్లి గ్రామాలు పైకి తేలాయి. 2005లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడంతో ఈ గ్రామాలను అధికారులు ఖాళీ చేయించి వేరే చోట పునరావాసం కల్పించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి ఎత్తిపోతలు బంద్ చేశారు. ఫలితంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్​లో నీటి నిల్వ సామర్థ్యం పూర్తిగా తగ్గు ముఖం పట్టింది. దీంతో ముంపునకు గురైన తమ నివాసాలను చూసుకుని ఆయా గ్రామస్తులు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.