అర్హులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇచ్చేది కాంగ్రెస్​ పార్టీనే: వినయ్ రెడ్డి

అర్హులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇచ్చేది కాంగ్రెస్​ పార్టీనే: వినయ్ రెడ్డి

ఆర్మూర్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అర్హులందరికీ ఇందిరమ్మ పథకం కింద ఇండ్ల స్థలాలు ఇచ్చి, ఇల్లు కట్టుకోడానికి రూ.5 లక్షలు ఇస్తుందని కాంగ్రెస్​పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు పొద్దుటూరి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. గడపగడపకు కాంగ్రెస్ లో భాగంగా శనివారం ఆర్మూర్ లోని రాజరాం నగర్, హుస్నాబాద్ లోని 27,33,35 వార్డుల్లో పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రచారం చేశారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్ రెడ్డి, నియోజకవర్గంలో ఒక్కరికి కూడా డబుల్ బెడ్ రూమ్ ​ఇవ్వలేదని, కానీ అతడు మాత్రం కోట్ల విలువైన రాజభవనాలు కట్టుకున్నాడన్నారు.

పదేండ్లుగా దోచుకున్న డబ్బుతో మరోసారి ప్రజల్ని మభ్యపెట్టి గెలవాలని చూస్తున్నాడని,ఈ సారి జాగ్రతపడాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీ స్కీమ్​లు అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో పీసీసీ ప్రచార కమిటీ మెంబర్ కోలా వెంకటేశ్, టౌన్ ప్రెసిడెంట్​సాయిబాబా గౌడ్, లీడర్లు మీర్ మాజీద్, విట్టం జీవన్, మహ్మద్ అలీ, రేగుల్ల సత్యనారాయణ, అజ్జు, మందుల పోశెట్టి, జిమ్మి రవి, బట్టు శంకర్, కర్ణం గంగాధర్, మీసాల రవి, హబీబ్, బాల కిషన్, కొంతం మురళి, భూపేందర్, బండ ప్రసాద్, పింజ అభినవ్, గోగికర్ శ్రీనివాస్, విజయ్ పాల్గొన్నారు.