ప్రగతి భవన్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

ప్రగతి భవన్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

ప్రగతి భవన్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. గణనాథుడికి సీఎం కేసీఆర్, శోభమ్మ  దంపతులు పూజలు నిర్వహించారు.  ఈ పూజ కార్యక్రమంలో  మంత్రి కేటీఆర్ – శైలిమ దంప‌తులు, కూతురు అలేఖ్య, పాల్గొన్నారు. 

రాష్ట్ర ప్రజ‌ల‌కు సుఖ‌శాంతుల‌ను అందించాల‌ని, ప్రజలందరినీ చల్లగా చూడాలని, రాష్ట్ర ప్రగ‌తి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా చూడాల‌ని విఘ్నేశ్వరుడిని సీఎం కేసీఆర్ కేసీఆర్ ప్రార్ధించారు. ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు లంబోదరుడి ఆశీస్సులతో నిర్విఘ్నంగా కొనసాగి, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఆనందంగా ఉండేలా దీవెనలు అందివ్వాలని  విఘ్నేశ్వరుని సీఎం ప్రార్థించారు.