గణపయ్యకు…కుడుములు,ఉండ్రాళ్లు

గణపయ్యకు…కుడుములు,ఉండ్రాళ్లు

భోజన ప్రియుడైన బొజ్జ గణపయ్యకు…ఎన్ని ఫలహారాలు పెట్టినా తక్కువే. మరి వినాయక చవితి రోజు వివిధరకాల నైవేద్యాలు పెట్టాల్సిందేగా. అందుకే ఆయనకు ఇష్టమైన, రుచికరమైన వంటలు మీ కోసం. ఈ పండుగకు ఇవి చేసి నైవేద్యంగా పెట్టండి.

పాల ఉండ్రాళ్లు
కావాల్సినవి: బియ్యప్పిండి: 80 గ్రాములు; నీళ్లు: పావులీటర్‌; నెయ్యి/ వెన్న: ఒక టేబుల్‌ స్పూన్; ఉప్పు: చిటికెడు; పాలు: అర లీటర్‌; చక్కెర: 120 గ్రాముల; కొబ్బరి తురుము: పావు కప్పు; యాలకుల పొడి: అర టీ స్పూన్ తయారీ: బియ్యప్పిండి జల్లెడ పట్టాలి. ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి, గోరు వెచ్చగా కాగబెట్టాలి. నీళ్ల‌లో చిటికెడు ఉప్పు, ఒక టేబుల్‌ స్పూన్‌ నెయ్యి/వెన్న, బియ్యప్పిండి వేసి ఉండలు లేకుండా ముద్దలా చేయాలి. పిండి చల్లారాక చిన్న చిన్న ఉండలు చేయాలి. మరో వెడల్పాటి గిన్నెలో పాలు మరగబెట్టాలి. ఆ పాలలో కొబ్బరి, యాలకుల పొడి, చక్కెర వేసి అది కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ఉండ్రాళ్ల‌ను కాగుతున్న పాలలో వేసి ఐదు నిమిషాలు సిమ్‌లో ఉడికించాలి. స్టవ్‌ ఆపేసి, పది నిమిషాలు గిన్నె కదిలించకుండా ఉంచితే ఉండ్రాళ్లు విరిగిపోవు.

మ‌రిన్ని వార్త‌ల కోసం