సమస్యలు పరిష్కరించేందుకు వినోద్​ పోటీ

సమస్యలు పరిష్కరించేందుకు వినోద్​ పోటీ
  • కాంగ్రెస్​ అభ్యర్థి గడ్డం వినోద్ కూతురు గడ్డం వర్ష

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించడానికే తన తండి, కాంగ్రెస్​అభ్యర్థి గడ్డం వినోద్  పోటీ చేస్తున్నారని వినోద్  కూతురు గడ్డం వర్ష  పేర్కొన్నారు.  తన తండ్రి గెలుపు కోసం శుక్రవారం   పట్టణంలోని  గడగడపకు నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు.  మదునన్ననగర్, కన్నాల బస్తీ, టేకులబస్తీ, పోస్టాఫీస్ బస్తీల్లో ఇల్లిల్లూ తిరుగుతూ తన తండ్రి వినోద్ కు ఈసారి ఓట్లు వేసి గెలిపించాలని వృద్ధులు, మహిళలను వేడుకున్నారు. 

బీఆర్ఎస్  వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు రావన్నారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు, మహిళలకు నెలకు రూ.2,500లు, వంటగ్యాస్ రూ.500 లకే, ఇందిరమ్మ ఇల్లుకు రూ.5 లక్షలు, ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్, విద్యార్థులకు  రూ.5 లక్షల విద్య భరోసా కార్డు ఇస్తామన్నారు. ఆరు గ్యారెంటీ లను అమలు చేస్తామన్నారు. ప్రచారంలో గడ్డం వినోద్ భార్య గడ్డం రమ,  మత్తమారి సూరి బాబు, మునిమంద స్వరూప,  రామగిరి లావణ్య, పొట్ల సురేశ్, సల్ల సంజీవరెడ్డి, గోమాస ప్రశాంత్, మొగురం కన్నయ్య,  బండి ప్రభాకర్ యాదవ్, చిలుముల శంకర్, నాతరి స్వామి, తాళ్లకృష్ణ మోహన్, లెంకల శ్రీనివాస్, పిల్లి ఆనంద్, కన్నూరి వెంకన్న, కాసిపాక రాజరత్నం, సోగాల రవికుమార్, కన్నూరి రాజలింగు, కనుకుంట్ల తిరుపతి, రొడ్డ శారద, కార్యకర్తలు పాల్గొన్నారు.

డప్పు కొట్టి దండోరా మోగించిన వర్ష

తన తండ్రి గడ్డం వినోద్ కు ఓట్లు వేసి  ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుతూ శుక్రవారం పట్టణంలో నిర్వహించిన  ప్రచారంలో వినోద్ కూతురు వర్ష డప్పు కొట్టి దండోరా మోగించారు. బెల్లంపల్లి ప్రజలు కాంగ్రెస్ కు ఓట్లు వేసి భారీ మెజార్టీతో తన తండ్రి వినోద్ ను గెలిపించుకోవాలని అభ్యర్థించారు. ప్రచారంలో లీడర్లు, కార్యకర్తలు  పాల్గొన్నారు.