రెబల్ స్టార్ ప్రభాస్ వెండితెరపై కనపిస్తే ఆ రచ్చే వేరు. ఇక ఆయన వింటేజ్ లుక్ లో , వినోదాన్ని పంచుతూ కనిపిస్తే బాక్సాఫీస్ లెక్కలు తారుమారు కావాల్సిందే. సంక్రాంతి 2026 రేసులో అత్యంత భారీ అంచాలతో వస్తున్న డార్లింగ్ చిత్రం 'ది రాజా సాబ్ '(The Raja Saab). టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ.. ప్రభాస్ కెరీర్లోనే ఒక వైవిధ్యమైన హారర్-రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతోంది.
'సహనా సహనా'.. విజువల్ ఫీస్ట్..
లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి ‘సహనా సహనా’ (Sahana Sahana) పూర్తి స్థాయి సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటలో ప్రభాస్ , నిధి అగర్వాల్ జోడీ వెరీ ఫ్రెష్‌గా, కలర్ఫుల్గా కనిపిస్తోంది. ప్రభాస్ స్టైలిష్ లుక్స్ అభిమానులకు కనువిందు చేస్తుంది. ఎస్.ఎస్. తమన్ తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేయగా, విశాల్ మిశ్రా తన గాత్రంతో ఈ రొమాంటిక్ మెలోడీని మరో స్థాయికి తీసుకెళ్లారు. కృష్ణకాంత్ అందించిన సాహిత్యం యువతను ఆకట్టుకుంటోంది.
Also Read : ఇది బ్రిటీష్ ఇండియా కాదు.. 'డేవిడ్ రెడ్డి' ఇండియా.. మనోజ్ పవర్ఫుల్ కమ్‌బ్యాక్!
ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్..
ప్రభాస్ అభిమానులకు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఊహించని శుభవార్త చెప్పారు. వాస్తవానికి ఈ సినిమా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. అయితే, క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని జనవరి 8నే స్పెషల్ ప్రీమియర్ షోలు వేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. అంటే డార్లింగ్ అభిమానులకు సంక్రాంతి వినోదం ఒకరోజు ముందుగానే మొదలుకాబోతుందన్నమాట.
హారర్ థ్రిల్లర్‌లో ప్రభాస్ విశ్వరూపం..
ప్రభాస్ సరసన ఈ చిత్రంలో మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ , నిధి అగర్వాల్ ముగ్గురు భామలు సందడి చేయనున్నారు. 'ది రాజాసాబ్' కేవలం రొమాన్స్ మాత్రమే కాదు, వెన్నులో వణుకు పుట్టించే హారర్ ఎలిమెంట్స్, కడుపుబ్బ నవ్వించే కామెడీ కూడా ఉండబోతున్నాయని దర్శకుడు మారుతి ఇప్పటికే స్పష్టం చేశారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ చేస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు రంగం సిద్ధం
హైదరాబాద్‌లోని భారీ ఓపెన్ గ్రౌండ్స్‌లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు నిర్మాత తెలిపారు. ఈ వేడుకకు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. అతి త్వరలోనే ఈ ఈవెంట్ తేదీని ప్రకటించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం.. సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ మార్క్ చూపించడం ఖాయం అంటున్నారు అభిమానులు.
