బతుకమ్మ చీరలపై ఫోటోలు

బతుకమ్మ చీరలపై ఫోటోలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా బీఆర్ఎస్ పార్టీకి చెందిన అధికారులకు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిర్పూర్ గ్రామంలో కేసీఆర్ పోటోలతోనే బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక ఫొటోలు తొలగించడాన్ని అధికారులు మరిచిపోయారు. అందరికి ఎన్నికల కోడ్‌ నిబంధనలు గురించి చెప్పే అధికారులే కోడ్‌ను పాటించకపోవడంతో విమర్శలకు దారితీస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 2023 నవంబర్ 30వ తేదీ పోలింగ్.. డిసెంబర్ 3వ తేదీ కౌంటింగ్ ఉండనుంది. ఎన్నికల షెడ్యూల్ రాకతో.. తెలంగాణలో అమల్లోకి ఎన్నికల కోడ్ వచ్చేసింది. డిసెంబర్ 5వ తేదీ వరకు ఈ కోడ్ అమల్లో ఉండనుంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ నిబంధనలు అమల్లోకి  ఉండనున్నాయి. 

Also Read :- నారా లోకేష్కు ఈడీ ప్రశ్నలు.. అరెస్ట్ చేస్తారా.?

 నిబంధనలు..

* ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో  తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకాలను ప్రకటించడానికి వీల్లేదు.
* బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఎయిర్ పోర్టులు సహా ప్రభుత్వ ప్రకటనలను తొలగించాల్సి ఉంటుంది.
* ప్రభుత్వం ఏం చేయాలన్నా కోడ్ నిబంధనలకు లోబడే చేయాల్సి ఉంటుంది.
* ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టకూడదు.
* ప్రభుత్వ  డబ్బుతో టీవీలు, పేపర్లలో ప్రకటనలు ఇవ్వొద్దు.
* తెలంగాణ ప్రభుత్వం  కొత్త పథకాలు ప్రకటించకూడదు.  
* సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రచారాలను నిలిపివేస్తారు.
* మంత్రులు అధికారిక హోదాల్లో పర్యటనలు చేయొద్దు. 
* ఎన్నికల ప్రచారంలోమంత్రులు.. ప్రభుత్వ ఉద్యోగులు, వాహనాలు, ప్రభుత్వ భవనాలు వంటి ఉపయోగించకూడదు.
* ఉద్యోగాల కల్పన, పదోన్నతుల వంటివి ఉండకూడదు
* మసీదు, చర్చి, ఆలయాల వద్ద ప్రచారం చెయ్యకూడదు.
* కరపత్రాలు, బ్యానర్లు, పార్టీ జెండాలు స్థల యజమాని అనుమతి లేకుండా అంటించరాదు
* అభ్యర్థులు వ్యక్తిగత జీవితం, కుటుంబంపై వ్యాఖ్యలు చేయకూడదు.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పనులను ప్రారంభించొద్దు. వాటికి శంకుస్థాపన చేయొద్దు
* సమావేశ స్థలాలు, హెలిప్యాడ్లు, ప్రభుత్వ అతిథి గృహాలు వంటివి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సమానంగా పంచుకోవాల్సి ఉంటుంది.
* మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు పూర్తిగా నిషేధం.
* తమ ఎన్నికల ప్రచారంలో లౌడ్ స్పీకర్లను ఉపయోగించే ముందు, అభ్యర్థులు, రాజకీయ పార్టీలు తప్పనిసరిగా స్థానిక అధికారులు నుండి అనుమతి తీసుకోవాలి.
* ఎన్నికల ర్యాలీల నిర్వహణకు ముందు అభ్యర్థులు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.
* ఎన్నికలు ముగిసే వరకు ఈ నిబంధనలు తెలంగాణలో అమల్లో ఉంటాయి. ఉల్లంఘించిన వారిపై ఈసీ చర్యలు తీసుకుంటుంది.