ఇన్నర్ రింగు రోడ్డు కేసులో లోకేశ్ సీఐడీ విచారణ కొనసాగుతోంది. అక్టోబర్ 10 సాయంత్రం 5 గంటల వరకు విచారించనున్నారు. లోకేష్ ను ఈ కేసులో ఏ14 గా చేర్చారు. హెరిటేజ్, లింగమనేని భూముల కోసం ఇన్నర్ రింగు రడ్డు అలైన్ మెంట్ ను మార్చాలని సీఆర్డీఏపై ఆయన ఒత్తిడి తెచ్చారని ప్రధాన అభియోగాలు మోపింది.
లోకేష్ కు ఈడీ ప్రశ్నలు
 
- ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చే ప్రాంతం మీకు ముందే తెలుసా?
 - అలైన్ మెట్ ను మూడు సార్లు ఎందుకు మార్చారు?
 - హెరిటేజ్ లబ్ధి చేకూర్చేలా మార్పు జరిగిందా?
 - ఐఆర్ఆర్ వచ్చిన ప్రాంతంలో భూములు ఎందుకు కొన్నారు?
 - లింగమనేని రమేశ్ తో మీకు ఉన్న సంబంధాలు ఎంటి?
 
Also Read :- ఈడీ ముందు హీరో నవదీప్
ఇప్పటికే స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ. లోకేశ్ ను కూడా అరెస్ట్ చేస్తుందేమోనని టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఈరోజు విచారణకు లోకేష్ సహకరించకపోయినా ..బయట ఉంటే ఇతరులను ప్రభావితం చేస్తారని సీఐడీ భావించినా ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. లేదంటే మళ్లీ విచారణకు రావాలని ఆదేశించే అవకాశముందంటున్నారు.
