రూ.10వేల విరాళం… సామాన్యులకూ శ్రీవారి వీఐపీ దర్శనం

రూ.10వేల విరాళం… సామాన్యులకూ శ్రీవారి వీఐపీ దర్శనం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వీఐపీ దర్శనం ఇకపై సామాన్యులకూ దక్కనుంది. ఇందుకు 10వేల రూపాయలను విరాళంగా ఇవ్వాలని సూచించింది టీటీడీ. ఇందుకుగాను… శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణం (శ్రీ వాణీ ట్రస్ట్) పేరుతో ఈ పథకాన్ని ఈ రోజునుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. దీంతో… భక్తులు కులశేఖరపడి కావలి వరకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోవచ్చు. నవంబర్ మొదటి వారంలో ఈ పథకానికి సంబంధించిన యాప్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి. విరాళాలు ఇచ్చిన భక్తుడికి ప్రోటోకాల్ తో దర్శణాన్ని కల్పిస్తామని చెప్పారు. అయితే 10వేల రూపాయలతో పాటు.. రూ.500 పెట్టి టికెట్ కొనాలని తెలిపారు.