
విరాజ్ అశ్విన్ హీరోగా వినోద్ గాలి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈటీవీ విన్‌తో కలిసి 90s కిడ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శరత్ చంద్ర నాయుడు నిర్మిస్తున్నారు. బుధవారం ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ముహూర్తపు షాట్‌కు నిర్మాత రవిశంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, దర్శకుడు హరీష్ శంకర్ ఫస్ట్ క్లాప్ కొట్టారు.
నిర్మాత ఎస్‌కేఎన్ గౌరవ దర్శకత్వం వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో బన్నీ వాస్, మెహర్ రమేష్, ప్రసాద్ నిమ్మకాయల, నిఖిల కోనేరు పాల్గొన్నారు. బలమైన భావోద్వేగాలతో కూడిన బడ్డీ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నామని మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇందులో ప్రియదర్శిని రామ్, బాబు మోహన్, యశశ్రీ రావు, శివన్నారాయణ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.