ఆసక్తి రేపే విరాజి

ఆసక్తి రేపే విరాజి

వరుణ్ సందేశ్ హీరోగా ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం ‘విరాజి’. శుక్రవారం సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ మాట్లాడుతూ ‘చీకట్లో ఉన్న వారికి వెలుగు పంచే వాడు విరాజి. ఇదే టైటిల్ జస్టిఫికేషన్. సస్పెన్స్ , థ్రిల్లర్, హారర్ ఎలిమెంట్స్, డ్రామా, ఎమోషన్ వంటి అంశాలతో రూపొందించారు.  

ఆండీ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో చాలా డిఫరెంట్‌‌‌‌గా కనిపిస్తా. మేకోవర్ కోసమే ఎక్కువ కష్టపడ్డా. సగం తెలుగు, సగం ఇంగ్లీష్ మాట్లాడే క్యారెక్టర్ నాది. మెంటల్ హాస్పిటల్‌‌‌‌కు వెళ్లిన ఆండీ  గందరగోళం సృష్టిస్తాడు.  అదేంటి అనేది ఆసక్తికరంగా ఉంటుంది.  కథలో అంతర్లీనంగా సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. చాలా ట్విస్టులు టర్న్స్ ఉంటాయి. ఒక మంచి మూవీ చేశామని  కాన్ఫిడెంట్‌‌‌‌గా ఉన్నాం’ అని చెప్పాడు.