
నిన్నటివరకు అతనో రోజువారీ కూలి. పనిచేస్తేనే కానీ పూట గడవదు. ఎక్కడ పని దొరికితే అక్కడకు వెళ్లి పనిచేసే వ్యక్తి. కానీ ఈ రోజు స్టైలిష్ మోడల్‌గా మారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. ఓ కూలి మోడలింగ్ చేయడమేంటి అనుకుంటున్నారా.. అయితే అదెలాగో తెలియాలంటే మనం కేరళ వెళ్లాల్సిందే.
కేరళలోని కోజికోడ్ జిల్లాకు చెందిన మమ్మిక్క (60) అనే వ్యక్తి రోజువారీ కూలిగా పనిచేసేవాడు. ఈయనను ఫోటోగ్రాఫర్ షరీక్ వయాలీల్ తన నేర్పరితనంతో మోడల్‌గా మార్చాడు. మమ్మిక్క చూడటానికి యాక్టర్ వినాయకన్‌ను పోలి ఉండటంతో మమ్మిక్క ఫోటోను షరీక్.. తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో అనుకోకుండా వైరల్ గా మారింది. దాంతో షరీక్ తన వెడ్డింగ్ సూట్ కంపెనీ కోసం మోడల్ గా చేయమని మమ్మిక్కను కోరాడు. అందుకు మమ్మక్క అంగీకరించడంతో.. వెంటనే ఆయన లుక్ మొత్తం మార్చి ఫోటో షూట్ చేశారు. మమ్మిక్క లుంగీ, చొక్కా తీసేసి.. సూట్, సన్ గ్లాసెస్‌తో స్టైలిష్‌గా మార్చారు. క్లాసిక్ బ్లేజర్ మరియు ప్యాంటు ధరించి, చేతిలో ఐప్యాడ్‌తో మమ్మిక్క నడుస్తూ స్విష్ మేక్ఓవర్‌తో అదరగొడుతున్నాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
❤️
Posted by Shareek Vayalil Shk on Tuesday, February 8, 2022
షరీక్ మాట్లాడుతూ.. తన కంపెనీ కోసం మోడల్‌గా చేయడానికి మమ్మిక్క కంటే గొప్పగా ఎవరూ ఉండరని అన్నాడు. ఫోటో షూట్ వైరల్ కావడంతో తను చేసింది తప్పేం కాదని షరీక్ అన్నాడు. తన ఫోటోలు వైరల్ కావడంతో అటు మమ్మిక్కా కూడా దినసరి కూలితో పాటు మోడలింగ్‌ను కూడా చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు.
For More News..