
మన దేశంలో ఇప్పుడు చాలా రకాల వంటకాలు, రుచులు దొరుకుతున్నాయి. ఎలాంటి ఫుడ్ కావాలన్న చిటికెలో ఆర్డర్ చేస్తే ఇంటి ముందుకే వచ్చేస్తుంది. అయితే జపాన్‌లోని ఇండియన్ స్పైస్ ఫ్యాక్టరీ అనే ఓ రెస్టారెంట్ భారతీయ వంటకాలని అలాగే భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని చాటిచెప్తూ అక్కడి ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ రెస్టారెంట్‌ను నకయామా-సాన్ & సచికో-సాన్ అనే జంట నడుపుతున్నారు. భారతదేశం పట్ల వాళ్ళకి ఉన్న అభిమానాన్ని వంటకాలు, సంప్రదాయం, అతిధి మర్యాదలతో భోజన అనుభవంగా మార్చారు.
ఈ రెస్టారెంట్ మెనూలో ఫిర్ని(బియ్యం పిండితో చేసే స్వీట్), మురుకు వంటి వంటకాలతో పాటు బెంగాలీ, దక్షిణ భారత భోజనాలు కూడా ఉంది. ఈ రెస్టారెంట్లో సాంప్రదాయమైన దక్షిణ భారత విందు స్టయిల్లో అరటి ఆకుల్లో భోజనాలు వడ్డిస్తున్నారు. రెస్టారెంట్ లోపల చూస్తే భారతీయ సంగీత వాయిద్యాలు, కళాఖండాలతో అలంకరించారు. సచికో-సాన్ కూడా చీర ధరించి అతిథులకు సాంస్కృతిక పద్దతిలో స్వాగతం పలుకుతూ భోజనాన్ని వడ్డిస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్ యూజర్ సోనమ్ మిధా ఓ వీడియోను పోస్ట్ చేసిన తర్వాత ఈ రెస్టారెంట్ అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు వీడియోకి క్యాప్షన్‌లో భారతదేశం, భారతీయ సంస్కృతి పట్ల వాళ్ళకి ఉన్న ప్రేమ సాటిలేనిది అంటూ రాసింది.
కోల్‌కతా, బెంగాలీ వంటకాల పట్ల వాళ్ళకి ఉన్న ఇష్టం, ప్రేమ భారతదేశంలో వాళ్ళ స్వంత అనుభవాలని ఆ జంట వివరించారు. గతంలో కోల్‌కతా, ఢిల్లీలోని రెస్టారెంట్లో పనిచేసిన నకయామా నేను ఇండియాలో ఉన్నప్పుడు సాధారణంగా నాకు తెలిసిన కోల్‌కతా/బెంగాలీ వంటకాల గురించి వీలైనంత ఎక్కువ మంది జపాన్ వాళ్ళతో చెప్పేదాన్ని అని అన్నారు.
ఈ వీడియో సోషల్ మీడియా యూజర్లను ఎంతో బాగా ఆకట్టుకుంది, చాలామంది ఈ జంట చేస్తున్నదానికి ఆనందపడిపోయారు. ఒకతను ప్రపంచంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఎలా కలిసి ఉంటారో ఈ విధంగా చూడటం చాలా ఆనందంగా ఉందని, మరొకరు నేను జపాన్ వెళ్ళినప్పుడు ఈ రెస్టారెంట్ గురించి తెలుసుకోవాలని ఉందని, ఇంకొకరు బెంగాలీ వంటకాలు మనకు దగ్గర లేకున్నా దేశాలు ఆ అడ్డంకులను బ్రేక్ చేసాయి, చాలా అద్భుతం అని అన్నారు.
ALSO READ : ప్రెగ్నెంట్ లేడీస్ పారాసెటమాల్ వాడితే ఇంత డేంజరా..?
మరికొందరైతే రెస్టారెంట్ వెళ్లి భోజనం చేసి వారి అనుభూతిని చెప్పుకున్నారు. ఒకతనైతే గత నెలలో నేను ఈ రెస్టారెంటుకి వెళ్ళాను, బెంగాలీ వంటకాలు ఎంత రుచిగా ఉన్నాయో చూసి ఆశ్చర్యపోయాను అని చెప్పారు.