వీడియో వైరల్: అత్యంత ఎత్తైన భవనంపై మహాత్ముడికి అరుదైన గౌరవం

వీడియో వైరల్: అత్యంత ఎత్తైన భవనంపై మహాత్ముడికి అరుదైన గౌరవం

న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి వేడుకలను శుక్రవారం దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. మన దేశంలోనే గాక విదేశాల్లోనూ గాంధీ జయంతిని సెలబ్రేట్ చేసుకున్నారు. ముఖ్యంగా దుబాయ్‌‌లో వేడుకలు మిన్నంటాయి. ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన భవనమైన దుబాయ్‌‌లోని బుర్జ్ ఖలీఫాపై గాంధీ ఫొటోలను ప్రదర్శించడం విశేషం. గాంధీ ఫొటోలతోపాటు త్రివర్ణ పతాకం చిత్రాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వీటికి సంబంధించిన వీడియో నెట్‌‌లో చక్కర్లు కొడుతోంది. గాంధీ జీవితం, ఇండియా స్వాతంత్ర్య పోరాటం గురించి బుర్జ్ ఖలీఫాపై స్పెషల్ ఎల్‌‌ఈడీ షోతో గౌరవం ఇచ్చారు. మరి మన బాపూను స్మరించుకున్న బుర్జ్ ఖలీఫా వీడియోను మీరూ చూసేయండి.