ఐస్ క్రీం అంటే భయమేస్తుంది : మొన్న చేతి వేలు.. ఇప్పుడు పెద్ద పురుగు

ఐస్ క్రీం అంటే భయమేస్తుంది : మొన్న చేతి వేలు.. ఇప్పుడు పెద్ద పురుగు

మనలో చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఐస్ క్రీమ్ లను ఎంతో ఇష్టంగా తింటారు.   కొందరు రోజు ఏదో ఒక ఫ్లెవర్ ఐస్ క్రీమ్ ను ఇష్టంతో తింటారు. ఇప్పుడు ప్రతి పార్టీలో  ఐస్​ క్రీం ను మరికొందరు ఇంట్లోనే వెరైటీలలో ఐస్ క్రీమ్ లను తయారు చేసుకుంటారు. మనం సాధారణంగా కొన్నిసార్లు స్నేహితులు, ఫ్యామీలీస్ తో కలిసి హోటల్స్ , రెస్టారెంట్లకు వెళ్తుంటాం.  ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడో.. లేకపోతే పిల్లలు మారాం చేస్తున్నప్పుడో ఐస్​ క్రీం ఆర్డర్ పెడుతుంటాం.

 మొన్నటికి మొన్న ముంబైలోని మలాడ్‌లో ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఐస్‌క్రీమ్‌లో మానవ వేలి కనిపించగా.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్​ లోని నోయిడా మరో షాకింగ్​ ఘటన జరిగింది. శనివారం ( జూన్​ 15) ఒక మహిళ ఆన్‌లైన్‌లో ఫ్యామిలీ ప్యాక్ ఐస్‌క్రీమ్‌ను ఆర్డర్ చేసింది.  ఓపెన్​ చేసి చూడగానే పురుగు కనపడటంతో  బిత్తరపోయింది.   ఈ ఘటనను మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఆ వీడియో వైరల్‌గా మారింది. నోయిడాలోని సెక్టార్​ 12 లో దీప అనే మహిళ నివసిస్తోంది.  మ్యాంగో మిల్క్​ ఐస్​ క్రీం కోసం పిల్లలు మారాం చేయడంతో .. ఆన్​ లైన్ బ్లింకిట్​ యాప్​ నుంచి రూ.195 విలువైన 'అమూల్ వెనిలా మ్యాజిక్ ఐస్ క్రీం ఆర్డర్ చేసింది. ఐస్​ క్రీం ప్యాక్​ లో పురుగును చూసి షాక్​కు గురయినట్లు తెలిపింది.  అయితే  అందులో ఇంకా మామిడికాయల క్రీం కలపలేదు. 

అమూల్​ ఒక ప్రసిద్ద బ్రాండ్​..  చీజ్, పనీర్, పెరుగు, లస్సీ, ఐస్ క్రీం తో పాల పదార్ధాలను విక్రయిస్తుంది.  అమూల్​కు ఉన్న బ్రాండ్​తో కస్టమర్లు ఎగబతుతుంటారు. అయితే ఇప్పుడు అమూల్​ ఐస్​ క్రీంలో పురుగు రావడం చర్చనీయాంశంగా మారింది. బ్లింకిట్​ యాజమాన్యం ఆ మహిళకు రూ. 195 రిటన్​ చేసిందని తెలిపింది.  అమూల్​ మేనేజర్​ కూడా ఈ ఘటనపై ఆ మహిళను సంప్రదించిందని వచ్చిర వార్తలను . ఆ మహిళ ఖండించింది. ఇంకా తనకు డబ్బులు రాలేదని.. తనను ఎవరూ స్పందించలేదని తెలిపింది.  ఇకనైనా ఆన్​ లైన్​ లో ఫుడ్​ ఐటమ్స్​ ఆర్డర్​ పెట్టకపోవడమే మంచిదని ఇలాంటి ఘటనల ద్వారా అర్దమవుతుంది.