కరోనా నుంచి రక్షణ కోసం కొత్త ఐడియా

కరోనా నుంచి రక్షణ కోసం కొత్త ఐడియా

కరోనాతో చైనీయులు వణికిపోతున్నారు. ఎలాగోలా వైరస్ గండం నుంచి గట్టెక్కాలని భావిస్తున్నారు. ఈక్రమంలో కొంతమంది క్రియేటివ్ గా ఆలోచిస్తున్నారు. కరోనా వైరస్ నుంచి తమను తాము కాపాడుకునేందుకు కొంగొత్త ఆలోచనలతో ముందుకొస్తున్నారు.  కూరగాయలు కొనేందుకు మార్కెట్ కు వెళ్లిన దంపతులు.. ఒక భారీ ప్లాస్టిక్ గొడుగును పట్టుకొని తిరుగుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. చైనా అధికారిక మీడియా సంస్థ ‘పీపుల్స్ డైలీ చైనా’ ఈ వీడియోను ట్విట్టర్ లో  పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వేలాది వ్యూస్ వచ్చాయి.

ఈ వీడియోను చూసిన నెటిజన్స్ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ‘‘ ఇలాంటి భారీ గొడుగు తో వైరస్ నుంచి వాళ్లకు  రక్షణ లభించొచ్చు. ఒకవేళ వాళ్లు కొన్న కూరగాయలపైనే కరోనా వైరస్ ఉండి ఉంటే ఏం చేయగలరు?’’ అని ఒక నెటిజన్ ప్రశ్నించాడు. ‘‘కరోనా లాంటి అతిసూక్ష్మ వైరస్ నుంచి రక్షణ పొందే శాస్త్రీయ మార్గం ఇదా ?’’ అని ప్రశ్నిస్తూ మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు.