ఫ్రూట్స్ ను మురుగునీటితో క‌డుగుతున్నాడు.. అడ్డంగా దొరికి అరెస్ట్ అయ్యాడు

ఫ్రూట్స్ ను మురుగునీటితో క‌డుగుతున్నాడు.. అడ్డంగా దొరికి అరెస్ట్ అయ్యాడు

పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి మేలును చేస్తాయని చాలా మంది చెబుతుంటారు. చెప్పడమే కాదు అది నిజమే. కానీ కొన్ని సార్లు వాటిని తిన్నా అనారోగ్యం పాలవుతున్నారు. దానికి కారణం పండ్లను అమ్మే వ్యాపారులు.. సరైన శుభ్రతా ప్రమాణాలు పాటించకపోవడమే. దానికి ఉదాహరణగా నిలుస్తోంది నోయిడాలోని ఓ ఘటన. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఈ వీడియోలో రోడ్డు పక్కన ఉన్న ఓ వ్యాపారి మురుగు నీటితో కొబ్బరికాయలను శుభ్రం చేయడం చూడవచ్చు. ఈ అసహ్యకరమైన ఘటన కెమెరాకు చిక్కింది. ఈ వీడియో వైరల్ కావడంతో.. విషయం కాస్తా పోలీసులకు చేరింది. ఆ తర్వాత పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. డ్రెయిన్‌ నీటిని ఉపయోగించి పండ్లను 'క్లీన్' చేసిన కొబ్బరి వ్యాపారిని అరెస్టు చేశారు.

ఈ షాకింగ్ వీడియోలో వ్యక్తి ప్లాస్టిక్ కంటైనర్‌లో కొంత అపరిశుభ్రమైన నీటిని నింపి, అమ్మకానికి పోగు చేసిన కొబ్బరి స్టాక్‌పై స్ప్రే చేయడం కూడా కనిపించింది. చుట్టుపక్కల ప్రజలు అతని నుంచి కొబ్బరి నీరు కొనుగోలు చేయకుండా హెచ్చరించడానికి ఓ వ్యక్తి ఈ ఫుటేజీని ట్విట్టర్‌లో పంచుకున్నారు.

https://twitter.com/STVRahul/status/1665931372274515968