ఫ్రూట్​ దోశ.. తింటే వావ్ అనాల్సిందే!

ఫ్రూట్​ దోశ.. తింటే వావ్ అనాల్సిందే!

దోశ.. ఎక్కువమంది ఇష్టంగా తినే బ్రేక్​ఫాస్ట్. ఎగ్ దోశ, పనీర్​ దోశ, మైసూర్​ మసాలా దోశ...  ప్రాంతాన్ని బట్టి, టేస్ట్​ని బట్టి దోశలో చాలా రకాలు ఉన్నాయి. ఈ మధ్య తోపుడు బండ్ల మీద, చిన్నపాటి టిఫిన్​ సెంటర్లలో ఇడ్లీ, దోశలు అమ్మేవాళ్లు  ఫుడ్​ ఎక్స్​పరిమెంట్స్ చేస్తూ, బిజినెస్​ పెంచుకుంటున్నారు. ఆ ప్రయత్నంలోనే జనాలకి కొత్త రుచుల్ని అందిస్తున్నారు. అలాంటిదే ఈ ఫ్రూట్ దోశ. ఈ వెరైటీ దోశని ఢిల్లీలోని ఒక ఇడ్లీ బండి అతను తయారుచేశాడు. మసాలా దోశలో ఆలుగడ్డ కూర వేసినట్టు, ఈ దోశలో ఫ్రూట్​ మసాలా వేస్తాడు. యాపిల్​, అరటి, ద్రాక్ష వంటి పండ్ల ముక్కలతో పాటు కొంచెం డ్రై ఫ్రూట్స్​ వేసి ఈ మసాలా తయారుచేశాడు. చివర్లో పనీర్, చీజ్, పండ్ల ముక్కలు చల్లి వేడివేడిగా అందిస్తాడు. వెరైటీ కాంబినేషన్​ ఉన్న ఈ దోశ టేస్ట్ చేసిన కొందరు ‘వావ్​ అద్భుతం’ అంటున్నారు. ‘ఎప్పుడైనా పండ్ల ముక్కలతో ఉన్న దోశ తిన్నారా?’ అనే క్యాప్షన్​తో ఉన్న ఈ వీడియోని ఇంటర్నెట్​లో ఇప్పటికే 25 లక్షలమందికి పైగా చూశారు.