'రామ్ ఆయేంగే'.. డ్యాన్స్ తో రామ భక్తిని చాటుకున్న టీచర్, స్టూడెంట్స్

'రామ్ ఆయేంగే'.. డ్యాన్స్ తో రామ భక్తిని చాటుకున్న టీచర్, స్టూడెంట్స్

జనవరి 22న అయోధ్యలో జరగనున్న ప్రతిష్ఠాపన మహోత్సవానికి ముందు సమాజంలోని అన్ని వర్గాలను రామమందిర ప్రారంభోత్సవం ఫీవర్ పట్టుకుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రాముడు తమ కళ్ల ముందు రాబోతున్నందుకు వివిధ రంగాలకు చెందిన ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియలో తాజాగా నాగ్‌పూర్ ఫిజిక్స్ టీచర్ ఒక స్కూల్‌లో తన విద్యార్థులతో కలిసి 'రామ్ ఆయేంగే' పాట బీట్‌లకు అనుగుణంగా డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో కాజల్ అసుదానీ అనే యూజర్ పంచుకున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ క్లిప్ లో రిథమిక్ బీట్‌లకు అనుగుణంగా టీచర్ తో పాటు విద్యార్థులు కూడా స్టెప్పులేశారు.

వీడియోలో ఏముందంటే..

టీచర్ ఆకుపచ్చ చీర ధరించి, సెంటర్ స్టేజ్‌ని తీసుకొని, ఆమె విద్యార్థులు అనుకరించడానికి ప్రయత్నించే శ్రావ్యమైన ట్యూన్‌లకు డ్యాన్స్ చేస్తూ కనిపించింది. విద్యార్థులు.. బాలురు, బాలికలు నృత్యం చేస్తూ, భౌతికశాస్త్ర(ఫిజిక్స్) ఉపాధ్యాయుని స్టెప్పులను అనుసరించడం కూడా ఈ వీడియోలో చూడవచ్చు. దీనికి ఇన్ స్టాలో దాదాపు 4వేల 5వందల లైక్ లు, అనేక కామెంట్లు వచ్చాయి. దీనికి అనుగుణంగా చాలా మంది పలు రకాలు కామెంట్లు పెట్టారు. మరికొందరు మాత్రం జై శ్రీరామ్ అని రాసుకొచ్చారు.

రామ మందిర ప్రతిష్ఠ

ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22న అయోధ్యలో జరగనుంది. 'ప్రాణ ప్రతిష్ఠ'ను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ పూజలు నిర్వహించనున్నారు. లక్ష్మీకాంత దీక్షిత్ నేతృత్వంలోని అర్చకుల బృందం ప్రధాన క్రతువులకు నాయకత్వం వహించనుెది. ఈ వేడుకకు పలువురు సినీ, క్రీడ, రాజకీయ ప్రముఖులను కూడా ఆహ్వానించారు.