ఫ్లైట్ లో ఫైటింగ్... ఓ రేంజ్ లో కామెంట్స్

ఫ్లైట్ లో  ఫైటింగ్... ఓ రేంజ్ లో  కామెంట్స్

విమానాల్లో జరుగుతున్న కొన్ని సంఘటనలు ఈమధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి ప్రజలను కలవరపెడుతూ ఇంకా ఎంతగానో ఆశ్చర్యపరుస్తున్నాయి.ఈమధ్య కాలంలో విమానాల్లో  ప్రయాణికుల చెడు ప్రవర్తన శ్రుతి మించుతుంది. తాజాగా అలాంటి మరో ఘటన ఇక్కడ జరిగింది. సాధారణంగా మనం..కిటికీ పక్క సీటు కోసం ప్రయాణికులు రైళ్లు, బస్సుల్లో తిట్టుకోవడం ... కొట్టుకోవడం వంటి ఘటనలు  చూసే ఉంటాం. అయితే ఇప్పుడు విండో సీటు కోసం ఏకంగా విమానంలోనే ప్రయాణికులు చాలా దారుణంగా కొట్టుకున్నారు.

 మాల్టా నుంచి లండన్ వెళ్తున్న ర్యాన్ ఎయిర్ విమానంలో ప్రయాణికులకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.. కిటికీ సీటు కోసం ఇద్దరు ప్రయాణీకులు దారుణంగా కొట్టుకున్నారు.. అందుకు సంబంధించిన వీడియో  నెట్టింట హల్ చల్ చేస్తుంది..

ర్యాన్ ఎయిర్ విమానం మాల్టా నుంచి లండన్ వైపు వెళ్తుంది.. ప్రయాణికులు విమానంలోకి చేరుకుంటున్నారు. విమానంలో నడవ సీటు ఉన్న ప్రయాణీకుడు ముందుగా వచ్చి తన సీటులో కూర్చున్నాడు. అయితే అతడి పక్కన ఉన్న విండో సీటులో కూర్చునేందుకు ఓ ప్రయాణికుడు ప్రయత్నించాడు. అయితే నడవ సీటులో కూర్చున్న వ్యక్తి విండో సీటు ప్రయాణికుడిని కిటికీ వైపుకి వెళ్లడానికి అనుమతించలేదని చెబుతున్నారు. విండో సీటు గురించి ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ మొదలైంది. కొద్దిసేపటికే ఈ సీటింగ్ ఏర్పాటుపై వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకుంది. ముందుగా కొంత మంది ప్రయాణికులు వారిద్దరినీ శాంతింపజేసేందుకు ముందుకు వచ్చారు. వీళ్ళ గొడవ తగ్గక పోవడంతో సిబ్బంది కూడా వచ్చి సర్ది చెప్పారు..

 

ఈ గొడవలో ఇద్దరూ ఒకరినొకరు చాలా దూషించుకుంటూ కొట్టుకున్నారు. నోటికి వచ్చిన బూతులతో తిట్టుకున్నారు.. విమానంలో గొడవ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. ఇక్కడ కూడా వదలరా అంటూ ఓ రేంజులో కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాలకే వైరల్అయింది. విమానాల్లో కూడా మొదలుపెట్టారంట్రా అంటూ ఈ గొడవపై నెటిజన్లు వ్యంగ్యంగా సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.