కుమారుడికి అకాయ్ అని పేరు పెట్టిన కోహ్లీ, అనుష్క.. దీని అర్థమేంటంటే..?

కుమారుడికి అకాయ్ అని పేరు పెట్టిన కోహ్లీ, అనుష్క.. దీని అర్థమేంటంటే..?

విరాట్ కోహ్లీ , అనుష్క శర్మ దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు.  ఫిబ్రవరి 15వ తేదీన   అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.  తాజాగా ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. రెండో బిడ్డకు అకాయ్  అని నామకరణం చేశామని చెప్పుకొచ్చాడు. అందరి ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు కావాలని ఇన్‍స్టాగ్రామ్‍‍లో పోస్ట్ చేశారు. కుమారుడికి అకాయ్ (Akaay) అని పేరు పెట్టినట్టు విరాట్, అనుష్క తెలిపారు.

విరాట్, అనుష్క తమ కుమారుడికి అకాయ్ అని పేరు పెట్టడంతో దీని అర్థమేంటని చాలా మంది నెట్టింట్లో వెతికేస్తున్నారు. అకాయ్ అనే పేరుకు ఐక్యత, ఏకత్వం అని అర్థమని తెలుస్తోంది. సంస్కృత పదమైన ఐక్య, కాయా నుంచి ఈ పేరును తీసుకున్నారు. అపరిమిత శక్తి అని కూడా దీనికి అర్థంగా ఉంది. అకాయ్ అనే పేరు టర్కిష్ మూలానికి చెందినది కూడా. దాని ప్రకారం అకాయ్ అంటే ‘ప్రకాశించే చంద్రుడు’ అని అర్థం వస్తుంది. అకాయ్ పేరులో అనుష్క, కోహ్లీ పేరు కూడా కలుస్తోంది. అనుష్కలోని ‘అ’, కోహ్లీలోని ‘క’ శబ్దాలతో ఈ పేరు ప్రారంభమైంది.

2021లో జన్మించిన తమ కుమార్తెకు వామిక అని పేరు పెట్టారు విరుష్క దంపతులు. ఆ పేరుకు దుర్గాదేవి అని అర్థం. విరాట్, అనుష్కకు 2017లో వివాహమైంది. కుమార్తె వామిక పేరులోని V అక్షరంతో విరాట్ కోహ్లీ పేరు ప్రారంభమవుతుంది. మరోవైపు కొడుకు Akaay పేరులోని మొదటి అక్షరం 'A' అనుష్క శర్మతో మొదలవడం ప్రస్తుతం వైరల్ గా మారింది.