Harry Kane: ఫుట్‌బాల్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యక్తిగత పురస్కారం బాలన్ డి’ఓర్ 2026 (Ballon d'Or 2026) అవార్డు ఇంగ్లాండ్ కెప్టెన్, బైయర్న్ మ్యూనిచ్ స్ట్రైకర్ హ్యారీ కేన్ (Harry Kane)ను వరించింది. సోమవారం రాత్రి జరిగిన కన్నులపండువ వేడుకలో కిలియన్ ఎంబాపె (Kylian Mbappe), లమిన్ యమాల్ (Lamine Yamal) లాంటి స్టార్ ఆటగాళ్లను వెనక్కి నెట్టి హ్యారీ కేన్ ఈ చారిత్రాత్మక ట్రోఫీని ముద్దాడాడు. 2001లో మైఖేల్ ఓవెన్ తర్వాత ఈ అవార్డును గెలుచుకున్న తొలి ఇంగ్లీష్ ఫుట్‌బాల్ ఆటగాడిగా (25 సంవత్సరాల తర్వాత) 33 ఏళ్ల హ్యారీ కేన్ రికార్డు సృష్టించాడు.
కేన్ 'గోల్డెన్' సీజన్ గణాంకాలు:
* 2025/26 సీజన్లో హ్యారీ కేన్ క్లబ్, దేశం తరఫున ఏకంగా 65 మ్యాచ్‌ల్లో 73 గోల్స్ సాధించి అద్భుతమైన ఫామ్‌ను కనబరిచాడు. బాలన్ డి’ఓర్ సాధించిన సీజన్లో లియోనెల్ మెస్సీ తర్వాత ఇన్ని గోల్స్ కొట్టిన ఏకైక ఫుట్‌బాలర్ కేన్ మాత్రమే.
* బైయర్న్ మ్యూనిచ్ తరఫున 61 గోల్స్: ఐరోపాలోని టాప్-5 లీగ్స్‌లో అందరి ఆటగాళ్ల కంటే కూడా కేన్ 19 గోల్స్ ఎక్కువగా సాధించాడు.
* బుండెస్లిగాలో 36 గోల్స్: వరుసగా మూడో సీజన్ 'గోల్డెన్ బూట్' దక్కించుకుని రాబర్ట్ లెవాండోవస్కీ రికార్డును ఈక్వల్ చేసేశాడు.
* ఛాంపియన్స్ లీగ్‌లో 14 గోల్స్: బైయర్న్ మ్యూనిచ్‌ను సెమీఫైనల్స్‌కు తీసుకెళ్లాడు. అలాగే అన్ని టోర్నీల్లో కలిపి 5 హ్యాట్రిక్‌లు సాధించాడు.
* ఇంగ్లాండ్ తరఫున 12 గోల్స్: 2026 ప్రపంచకప్‌లో 6 గోల్స్‌తో గ్యారీ లినెకర్ను వెనక్కి నెట్టి ఇంగ్లాండ్ ఆల్-టైమ్ వరల్డ్ కప్ లీడింగ్ స్కోరర్‌గా (14 గోల్స్) నిలిచాడు. ఐదు భిన్నమైన ప్రధాన అంతర్జాతీయ టోర్నీల్లో గోల్స్ కొట్టిన తొలి ఇంగ్లీష్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు.
* మూడు ట్రోఫీలు: ఈ సీజన్లో బైయర్న్ మ్యూనిచ్ ఫ్రాంజ్ బెకెన్బౌర్ సూపర్‌కప్, బుండెస్లిగా, DFB-పోకాల్ ట్రోఫీలను గెలవడంలో హ్యారీ కేన్ కీలక పాత్ర పోషించాడు.
😙🌕 Harry Kane, the first English player to win the Ballon d’Or since Michael Owen in 2001 — 25 years later, in London. English players who won the Ballon d’Or: Stanley Matthews, Bobby Charlton, Kevin Keegan (x2), Michael Owen, Harry Kane. https://t.co/84trDd1Odc
— Fabrizio Romano (@FabrizioRomano) October 26, 2026
మై ఫ్రెండ్.. దీనికి నీవు అర్హుడివి: విరాట్ కోహ్లీ
* హ్యారీ కేన్ బాలన్ డి’ఓర్ సాధించిన అనంతరం భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ (Virat Kohli) సోషల్ మీడియా వేదికగా 'X' (ట్విట్టర్)లో స్పెషల్ పోస్ట్ చేశాడు. కేన్‌ను 'మై ఫ్రెండ్' అని సంబోధిస్తూ కోహ్లీ రాసుకొచ్చాడు. హ్యారీ మై ఫ్రెండ్.. ఫుట్‌బాల్‌లోని అత్యున్నత స్థాయిలో ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ప్రదర్శించిన నిబద్ధత, కష్టపడే తత్వం, ప్రామాణికతకు ఈ అవార్డు నీకు ఎంతో అర్హమైంది. నీ విజయం చూసి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను.. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని చల్లగా చూడాలి.. నీ ఈ ప్రయాణాన్ని చూసి నీ ఫ్యామిలీ ఎంతో గర్విస్తుందని భావిస్తున్నాను.. నా తరఫున ఎల్లప్పుడూ ఆల్ ది బెస్ట్.. కాంగ్రాచ్యులేషన్స్! అని కింగ్ కోహ్లీ పేర్కొన్నాడు.
Harry my friend, you deserve every bit of this award for your resilience, hard work and honesty with which you’ve carried yourself through all these years playing football at the top. Really happy for you. God bless you and your family. They must all be very proud of you as you would be of your own journey. My best wishes always. Congratulations 👏❤️ @HKane
— Virat Kohli (@imVkohli) October 27, 2026
