గూగూల్ 25ఏళ్ల చరిత్రలో.. ఎక్కువ మంది సెర్చ్ చేసింది ఈ స్టార్ క్రికెటర్ గురించే..

గూగూల్ 25ఏళ్ల చరిత్రలో.. ఎక్కువ మంది సెర్చ్ చేసింది ఈ స్టార్ క్రికెటర్ గురించే..

భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ అభిమానుల సంఖ్యకు హద్దులు లేవు. ఈ విషయంలో ఈ దిగ్గజ బ్యాటర్ ను బీట్ చేయడం చాలా కష్టమని చాలా మంది భావిస్తుంటారు కూడా. క్రీడా ప్రపంచంలో ఎంతో మందికి ఇష్టమైన అథ్లెట్లలో కోహ్లీ ఒకడు. ఈ మాస్ట్రో బ్యాటర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా కోహ్లి ఓ చారిత్రక ఘనత సాధించాడు. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ తన 25 ఏళ్ల చరిత్రలో.. అత్యధికంగా శోధించిన విషయాలను ప్రకటించింది. ఈ జాబితాలో కోహ్లీ పేరు అగ్రస్థానంలో ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా గూగుల్ తన చరిత్రలో అత్యధికంగా శోధించిన విషయాలను ప్రకటించేందుకు ఒక వీడియోను విడుదల చేసింది.

ఫుట్‌బాల్‌.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇది Google చరిత్రలో అత్యధికంగా సెర్చ్ చేసిన క్రీడ అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా, క్రిస్టియానో ​​రొనాల్డో సెర్చ్ ఇంజన్ చరిత్రలో అత్యధికంగా శోధించబడిన ఫుట్‌బాల్ ఆటగాడు. అతను మరొక లెజెండ్ - లియోనెల్ మెస్సీ కంటే ముందంజలో ఉన్నాడు.

కోహ్లీ ఇటీవల ODI ప్రపంచ కప్ 2023లో ఆడాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో శతకం బాదడంతో వన్డే ఫార్మాట్‌లో సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల భారీ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు.

2023లో ఏం సెర్చ్ చేశారంటే..

గూగుల్ 2023లో అత్యధికంగా శోధించిన అంశాల జాబితాను విడుదల చేసింది. స్పోర్ట్స్ కేటగిరీ వివరాలు వెల్లడించిన గూగుల్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భారతదేశంలో అత్యధికంగా సెర్చ్ చేసిన అంశమని తేల్చింది. ఇక లీగ్ సెర్చింగ్ లో క్రికెట్ ప్రపంచ కప్, ఆసియా కప్‌లను కూడా అధిగమించింది. అత్యధికంగా శోధించబడిన టాపిక్‌లలో మహిళల ప్రీమియర్ లీగ్ నాల్గవది కాగా, ఆసియా క్రీడలు ఐదవ స్థానంలో ఉన్నాయి.

2023లో భారతదేశంలో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 విషయాలు:

  • ఇండియన్ ప్రీమియర్ లీగ్
  • క్రికెట్ ప్రపంచ కప్
  • ఆసియా కప్
  • మహిళల ప్రీమియర్ లీగ్
  • ఆసియా క్రీడలు
  • ఇండియన్ సూపర్ లీగ్
  • పాకిస్థాన్ సూపర్ లీగ్
  • యాషెస్
  • మహిళల క్రికెట్ ప్రపంచ కప్
  • SA20