IND vs AUS Final: ఊకో.. ఊకో.. : విరాట్ కోహ్లీని హత్తకుని ఓదార్చిన భార్య అనుష్క

IND vs AUS Final: ఊకో.. ఊకో.. : విరాట్ కోహ్లీని హత్తకుని ఓదార్చిన భార్య అనుష్క

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయిన భారత ఆటగాళ్లు.. గ్రౌండ్ లోనే కన్నీటి పర్యంతం అయ్యారు. వెక్కి వెక్కి ఏడ్చారు. టోర్నమెంట్ లో అన్ని మ్యాచ్ లు గెలుస్తూ వచ్చి.. ఫైనల్ లో ఘోరమైన ఆటతీరుతో కప్ చేజార్చుకున్నారు. సెంటిమెంట్ పరంగా అన్నీ కలిసి వస్తున్న సమయంలో.. విధిరాత మరోలా ఉండటంతో.. కప్ ఆస్ట్రేలియాకు అప్పగించారు మనోళ్లు..

140 కోట్ల మంది ఆశలను ఆవిరి చేసిన భారత ఆటగాళ్లు.. గ్రౌండ్ లో బోరున విలపించారు. ఒకరికి ఒకరు ఓదార్చుకున్నారు. టీం మేనేజ్ మెంట్ సైతం అండగా నిలబడి దైర్యం చెప్పింది. ఈ సమయంలో విరాట్ కోహ్లీని.. భార్య అనుష్క శర్మ హత్తుకుని మరీ ఓదార్చింది. తీవ్ర బాధ, మనోవేదనతో ఉన్న భర్తను ఓదార్చి దైర్యం చెప్పింది. గెలుపోటములు సహజం.. ఇవాళ మనది కాదు.. అలా అని బాగా ఆడలేదా అంటే బాగానే ఆడారు.. మన కంటే వాళ్లు ఇంకా బాగా ఆడారు.. మీరు దైర్యం ఉండండి.. సీనియర్ ఆటగాడిగా.. మిగతా జట్టు సభ్యులకు మీరు దైర్యం చెప్పాలి.. ముందుకు సాగాలి అంటూ అనుష్క శర్మ.. భర్త విరాట్ కోహ్లీని ఓదార్చారు.. 

విరాట్ కోహ్లీని.. హత్తుకుని ఓదార్చుతున్న అనుష్క శర్మ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మీ వెంట మేమున్నాం.. మీరు దైర్యం ఉండండి.. ఇండియన్ క్రికెట్ ను ముందుకు తీసుకెళ్లండి.. ఇలాంటి కష్టకాలంలో.. భార్యగా మీ మద్దతు కోహ్లీకి అవసరం అంటూ నెటిజన్లు పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

ఈ వరల్డ్ కప్ లో 11 మ్యాచ్ లాడిన కోహ్లీ మొత్తం 765 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 3 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు చేసిన విరాట్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ గా నిలిచాడు. సెమీస్ లో న్యూజీలాండ్ పై సెంచరీ, ఫైనల్లో ఆస్ట్రేలియాపై కీలకమైన 54 రన్స్ చేసాడు. ఇంత చేసినా జట్టుకు టైటిల్ అందించలేకపోయాననే వెలితి కోహ్లీకి అలాగే ఉంది.