ICC ODI Rankings: కోహ్లీకి కలిసొచ్చిన బాబర్ ఫెయిల్యూర్.. వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-5లోకి

ICC ODI Rankings: కోహ్లీకి కలిసొచ్చిన బాబర్ ఫెయిల్యూర్.. వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-5లోకి

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టాప్-5 లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు వన్డేల్లో డకౌటైన విరాట్.. టాప్-5లో చోటు కోల్పోయి ఆరో స్థానానికి పడిపోయాడు. పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ అజామ్ శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలోకి విఫలం కావడం విరాట్ కు కలిసొచ్చింది. బుధవారం (నవంబర్ 12) ఐసీసీ ప్రకటించిన లేటెస్ట్ ర్యాంకింగ్స్ లో ఒక స్థానం ఎగబాకి కోహ్లీ ఐదో స్థానంలో నిలిచాడు. మరోవైపు బాబర్ అజామ్ రెండు స్థానాలు దిగజారి ఏడో ర్యాంక్ కు పడిపోయాడు. 

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్ర స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆస్ట్రేలియా పై ఇటీవలే జరిగిన వన్డే సిరీస్ లో సత్తా చాటిన రోహిత్.. 38 ఏళ్ళ వయసులో వన్డేల్లో నెంబర్ ర్యాంక్ కు చేరుకొని చరిత్ర సృష్టించాడు. ఈ సిరీస్ కు ముందు మూడో స్థానంలో ఉన్న హిట్ మ్యాన్.. రెండు స్థానాలు ఎగబాకి నెంబర్ స్థానానికి చేరుకోవడం విశేషం. అంతేకాదు వన్డేల్లో అతి పెద్ద వయసులో నెంబర్ ర్యాంక్ అందుకున్న ప్లేయర్ గా రికార్డులకెక్కాడు. సహచర ప్లేయర్ శుభమాన్ గిల్ నాలుగో స్థానంలో ఉన్నాడు. 

ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ ఇబ్రహీం జద్రాన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.  శ్రేయాస్ అయ్యర్ ఒక స్థానం మెరుగుపర్చుకొని తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో అద్భుతంగా రాణించిన డారిల్ మిచెల్ మూడో స్థానంలో నిలిచాడు. శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక ఒక స్థానం ఎగబాకి ఆరో స్థానానికి చేరుకున్నాడు. ఐర్లాండ్ బ్యాటర్ హ్యారీ టెక్టార్ 8 స్థానంలో ఉండగా.. వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ 10 స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ ఓపెనర్ సైన్ అయూబ్ ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 36 వ స్థానికి చేరుకోవడం విశేషం. 

ఐసీసీ లేటెస్ట్ వన్డే ర్యాంకింగ్స్:
 
1) రోహిత్ శర్మ - ఇండియా ( 781)

2) ఇబ్రహీం జర్దాన్ - ఆఫ్ఘనిస్తాన్ ( 764)

3) డారిల్ మిచెల్ - న్యూజిలాండ్ (746)

4) శుభ్‌మాన్ గిల్ - భారతదేశం (745)

5) విరాట్ కోహ్లీ - ఇండియా (725)

6) చరిత్ అసలంక - శ్రీలంక (710)

7) బాబర్ ఆజం - పాకిస్తాన్ (709)

8) హ్యారీ టెక్టర్ - ఐర్లాండ్ (708)

9) శ్రేయాస్ అయ్యర్ - ఇండియా (700)

10) షాయ్ హోప్ - వెస్టిండీస్ (690)             

►ALSO READ | Mohammed Malik: సిరాజ్ స్పూర్తితో టీమిండియాలోకి వస్తా.. భారత అండర్-19 జట్టులో హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్