Virat Kohli Retirement: కింగ్ మనసు మార్చుకుంటాడా..? కోహ్లీని రిక్వెస్ట్ చేస్తున్న బీసీసీఐ.. ఆ రోజే రిటైర్మెంట్‌పై తుది నిర్ణయం

Virat Kohli Retirement: కింగ్ మనసు మార్చుకుంటాడా..?  కోహ్లీని రిక్వెస్ట్ చేస్తున్న బీసీసీఐ.. ఆ రోజే రిటైర్మెంట్‌పై తుది నిర్ణయం

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడనే నిర్ణయం సంచలనంగా మారింది. వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాలనే తన ఆలోచనని బీసీసీఐకి తెలియజేసాడట. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావాలనే తన ఉద్దేశ్యాన్ని తెలియజేసిన కోహ్లీ.. ఇకపై 2027 వన్డే వరల్డ్ కప్ పై దృష్టి పెట్టాలనుకున్నట్టు సమాచారం. ఈ విషయంపై కోహ్లీ ఇప్పటివరకు ఎలాంటియూ అధికారిక ప్రకటన చేయకపోయినా ఫ్యాన్స్ మాత్రమే ఆందోళనకు గురవుతున్నారు. వస్తున్న సమాచార ప్రకారం కోహ్లీని వదులుకోవడానికి బీసీసీఐ ఇష్టపడట్లేదు. 

కోహ్లీ అనుభవం జట్టుకు ఉపయోగపడాలని.. అతడు మరి కొన్నేళ్ల పాటు టెస్ట్ ఫార్మాట్ లో కొనసాగాలని రిక్వెస్ట్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కోహ్లీ తన మనసు మార్చుకుంటాడని బీసీసీఐ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. "కోహ్లీ ఇప్పటికీ చాలా ఫిట్‌గా ఉన్నాడు. అతనిలో పరుగులు చేయాలనే తపన ఇంకా అలాగే ఉంది. డ్రెస్సింగ్ రూమ్‌లో అతని ఉనికి మొత్తం జట్టును ఉత్సాహపరుస్తుంది" అని ఒక బీసీసీఐ అధికారి అన్నట్టు సమాచారం. తుది నిర్ణయం తీసుకునే ముందు అతను కొంత సమయం తీసుకోవాల్సిందిగా సూచించామని బీసీసీఐ అధికారి తెలిపినట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. 

ఇంగ్లాండ్ తో జూన్ 20 నుంచి 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ కు ముందే రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి షాక్ కు గురి చేశాడు. మే 23 న సెలక్షన్ కమిటీ ఇంగ్లాండ్ కు వెళ్లబోయే భారత టెస్ట్ జట్టును ప్రకటించనుంది. రానున్న 10 రోజుల్లో కోహ్లీ టెస్ట్ క్రికెట్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇంగ్లాండ్ పర్యటనకు ముందే కోహ్లీ కూడా రిటైర్ అయితే.. భారత టెస్ట్ జట్టుకు బ్యాటింగ్ విభాగంలో అంత సీనియర్లు లేకపోవడం  భారత్ కు పెద్ద సవాల్. అప్పుడు  యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, శుభ్‌మాన్ గిల్ వంటి ఆటగాళ్లపై  టీమిండియా ఆధారపడి ఉండాల్సి వస్తుంది. 

►ALSO READ | IPL 2025: టోర్నమెంట్ వాయిదా పడితే బీసీసీఐకి ఇన్సూరెన్స్ డబ్బులొస్తాయా..? అండగా అంబానీ..

టెస్ట్ కెరీర్ లో విరాట్ కోహ్లీ గత రెండేళ్లుగా ఘోరంగా విఫలమవుతున్నాడు. ముఖ్యంగా స్వదేశంలో స్పిన్ ధాటికి కుదేలవుతున్నాడు. చివరి రెండేళ్లలో కోహ్లీ యావరేజ్ 30 కంటే తక్కువగా ఉండడం ఆందోళన కలిగించే విషయం. పేలవ ఫామ్ తో తన టెస్ట్ యావరేజ్ 54 నుంచి 47 కి పడిపోయింది. ఫామ్ లేని కారణంగా కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు 123 టెస్టుల్లో 210 ఇన్నింగ్స్ లు ఆడిన కోహ్లీ.. 46.85 యావరేజ్ తో 9230 పరుగులు చేశాడు. వీటిలో 30 సెంచరీలతో పాటు 51 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.