Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోనే సెటిల్ అయిన సంగతి అందరికి తెలిసిందే. లండన్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న కింగ్.. అక్కడి యంగ్ బ్యాటర్లకు మెంటార్‌గా మారి టిప్స్ ఇస్తూ కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 2025లో టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ.. ఈరోజు (జూన్ 17, బుధవారం ) ది ఓవల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు ద్వారా ఇంగ్లాండ్ తరఫున టెస్ట్ డెబ్యూ చేస్తున్న 25 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్ (Jordan Cox) కు కొన్ని టిప్స్ ఇస్తూ కెమెరా కంటికి చిక్కాడు.
రెస్టారెంట్‌లో కోహ్లీ– కాక్స్ ముచ్చట్లు:
టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ఒక రోజు ముందు (మంగళవారం) విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ ప్లేయర్ జోర్డాన్ కాక్స్ లండన్‌లోని ఒక రెస్టారెంట్‌లో డిన్నర్ చేస్తూ కనిపించిన ఫోటోలు నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. కోహ్లీ ఏదో సీరియస్‌గా చెప్తుంటే.. కాక్స్ ఎంతో శ్రద్ధగా వింటున్నట్లు ఆ ఫోటోల్లో కనిపిస్తోంది. కాగా వీరిద్దరికీ ఈ పరిచయం ఎక్కడిదబ్బా అనుకుంటున్నారా?.. ఐపీఎల్ 2026 సీజన్‌లో కోహ్లీ, జోర్డాన్ కాక్స్ ఇద్దరూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) డ్రెస్సింగ్ రూమ్‌ను షేర్ చేసుకున్నారు. ఈ సీజన్‌లో జోర్డాన్‌కు ఒక్క మ్యాచ్ ఆడే ఛాన్స్ రాకపోయినా.. కోహ్లీ మాత్రం 675 రన్స్‌తో దుమ్ములేపాడు. అలా తన ఆర్‌సీబీ జూనియర్ టెస్ట్ డెబ్యూ చేయబోతుండటంతో.. కోహ్లీ ఇంగ్లాండ్ కండిషన్స్‌పై తనకున్న ఎక్స్‌పీరియన్స్‌తో కొన్ని క్రేజీ టిప్స్ ఇచ్చి ఉంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
విరాట్ కోహ్లీ కమ్‌బ్యాక్ ఎప్పుడంటే:
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ హ్యామ్‌స్ట్రింగ్ (Hamstring Injury) గాయానికి గురయ్యాడు. ప్రికాషన్ కింద ప్రస్తుతం జరుగుతున్న ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు కోహ్లీ దూరమయ్యాడు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ కోహ్లీకి పూర్తిగా రెస్ట్ ఇచ్చి, రాబోయే ఇంపార్టెంట్ విదేశీ టూర్‌కు పర్ఫెక్ట్‌గా ఫిట్ అవ్వాలని బ్రేక్ ఇచ్చింది. లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం.. జూలై 14 నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ వన్డే (ODI) సిరీస్ ద్వారా కోహ్లీ మళ్లీ టీమిండియా జెర్సీతో గ్రౌండ్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. ఒక నెల రోజుల రికవరీ టైమ్ కోహ్లీ మళ్లీ పీక్ ఫిట్‌నెస్ సాధించడానికి సరిపోతుందని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తుంది.
►ALSO READ | టాస్ గెలిచిన నెదర్లాండ్స్.. భారత్ మహిళల జట్టుకు బ్యాటింగ్ ఆహ్వానం
ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్ ప్లేయింగ్ XI:
ఇంగ్లాండ్ టీమ్: బెన్ డకెట్, ఎమిలియో గే, జాకబ్ బెథెల్, జో రూట్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, జేమ్స్ రీవ్ (వికెట్ కీపర్), జోర్డాన్ కాక్స్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్, మాథ్యూ ఫిషర్, సోనీ బేకర్.
న్యూజిలాండ్ టీమ్: టామ్ లాథమ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, నాథన్ స్మిత్, కైల్ జేమీసన్, మాట్ హెన్రీ, విలియం ఒరూర్కే.
Virat Kohli enjoying some time with Jordan Cox in London 🤍
— 𝚅𝚊𝚛𝚞𝚗¹⁸ (@varunx18) June 16, 2026
Jordan Cox is making his Test debut tomorrow. Maybe Virat is sharing some valuable advice and experiences with the youngster ahead of a special day in his career.
A lovely gesture from King Kohli.
Wishing you all the… pic.twitter.com/AjzAI7VojQ
