మొదటిసారి అనుష్కను చూసి వణికిపోయా.. తన లవ్ స్టోరీ చెప్పిన విరాట్ కోహ్లీ  

మొదటిసారి అనుష్కను చూసి వణికిపోయా.. తన లవ్ స్టోరీ చెప్పిన విరాట్ కోహ్లీ  

ప్రతీ ఒక్కరి జీవితంలో మొదటి ప్రేమ అందులో మొదటి మీటింగ్ చాలా ప్రత్యేకమైనది. ఎవరూ ఆ క్షణాలను జీవితంలో మరిచిపోలేరు. అయితే, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల లవ్ స్టోరీ గురించి అందరికీ తెలుసు. చాలామంది.. ఈ జంటను తమ ఫేవరెట్ కపుల్ అని కూడా అంటారు. కాకపోతే ఈ ఇద్దరి మొదటి మీటింగ్.. ప్రేమ విషయాన్ని ఎవరు మొదట బయటపెట్టారు అన్న విషయాలు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు.. తమ ప్రేమ విషయాల్ని విరాట్ బయటపెట్టాడు.  ఏబీ డివిలియర్స్ తో కలిసి 360 యూట్యూబ్ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ చెప్పేశాడు. అందరిలాగానే తానూ మొదట భయపడ్డానని విరాట్ చెప్పుకొచ్చాడు.

‘అనుష్కను నేను మొదట కలిసింది 2013 ఒక కమర్షియల్ యాడ్ షూటింగ్ లో.  నన్ను అప్పుడు జింబాంబ్వే పర్యటనకు కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఆ కంగారులో ఉన్న టైంలో నా మేనేజర్ వచ్చి హీరోయిన్ అనుష్క శర్మతో యాడ్ షూటింగ్ ఉంది. రెడీగా ఉండమని చెప్పి వెళ్లిపోయాడు. దాంతో నాకు చాలా కంగారు వేసింది. బాలీవుడ్ టాప్ హీరోయిన్ తో షూటింగ్ ఏంటి? తనతో ఎలా ఉండాలి? నాతో మాట్లాడుతుందా? అన్న ప్రశ్నలు ఎదురయ్యాయి. చాలా నెర్వస్ గా ఫీల్ అయ్యా. షూటింగ్ సెట్ కి చేరుకున్న తర్వాత.. అనుష్కను చూశా. నాకన్నా ఎత్తుగా కనిపించింది. నా తల కాస్త కిందికి వంచి తన కాళ్లవైపు చూశా. హీల్స్ వేసుకొని కనిపించింది.

తర్వాత తన దగ్గరికి వెళ్లి నీకు ఇంతకన్నా ఎక్కువ హీల్స్ ఉన్నవి దొరకలేదా.. అని వ్యగ్యంగా అన్నా. దాంతో కాస్త చిరాగ్గా ముఖం పెట్టి అక్కడినుంచి వెళ్లిపోయింది. షూటింగ్ మొదలయ్యాక  మాట మాట కలిసింది. ఫ్రెండ్స్ అయ్యాం. నెంబర్లు షేర్ చేసుకున్నాం. కొన్ని రోజులు మాట్లాడుకున్నాం. తనను ఫస్ట్ టైం చూసినప్పుడే తనతో డేటింగ్ లో ఉన్నా అనిపించింది. ఈ విషయాన్నే అనుష్కతో షేర్ చేసుకున్నా. విషయం చెప్పగానే కోపగించుకుంది. తర్వాత మాటల్లో పెట్టి కూల్ చేశా. మెల్లిమెల్లిగా అభిప్రాయాలు కలిశాయి. నా డేటింగ్ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేసింది’ అంటూ విరాట్ తన ఫస్ట్ సైట్ లవ్ గురించి చెప్పుకొచ్చాడు. తర్వాత ఈ ఇద్దరు 2017లో ఇటలీలోని టుస్కానీలో పెళ్లి చేసుకున్నారు.