Virat Kohli: నా కల సాకారమైంది.. అలీబాగ్‌లో డ్రీమ్ హోమ్‌పై కోహ్లీ

Virat Kohli: నా కల సాకారమైంది.. అలీబాగ్‌లో డ్రీమ్ హోమ్‌పై కోహ్లీ

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. మహారాష్ట్రలోని అలీబాగ్ ప్రాంతంలో 7.45 ఎకరాల ల్యాండ్‌ను కొనుగోలు చేసి తమ డ్రీమ్ హోమ్‌ ను నిర్మించుకున్నారు. నగర జీవితానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో, సువిశాల విస్తీర్ణంలో తమ ఇంటిని కట్టుకున్నారు. ప్రముఖ ఆర్కిటెక్ మజుందార్ బ్రావో ఈ ఇంటి నిర్మాణాన్ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని అనుమతులను పూర్తి చేసుకుని ఇంటి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. తాజాగా కోహ్లీ తన డ్రీమ్ హౌస్ పై అప్ డేట్ ఇచ్చాడు.

అలీబాగ్ తో తన 12 నెలల జర్నీని గుర్తు చేసుకొని సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశాడు. “నా అలీబాగ్ ఇంటిని నిర్మించే ప్రయాణం చాలా ప్రత్యేక అనుభవం. ఇదంతా చూస్తుంటే చాలా సంతోషంగా.. సంతృప్తికరంగా అనిపిస్తుంది. మా డ్రీమ్ హోమ్‌ను సాకారం చేసినందుకు మొత్తం అవాస్ టీమ్‌కు ధన్యవాదాలు. నాకు ఇష్టమైన వ్యక్తులతో ఇక్కడ ప్రతి క్షణాన్ని ఆస్వాదించాడనికి ఎదురు చూస్తున్నాను". అని కోహ్లీ అన్నాడు.     

టీ20 వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ ప్రస్తుతం హాలిడే ట్రిప్ కు వెళ్లినట్టు సమాచారం. లండన్ లో తమ ఫ్యామిలీతో కోహ్లీ ఎంజాయ్ చేస్తున్నాడు. టీ20 లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ ఇకపై వన్డే, టెస్టులపై దృష్టి పెట్టనున్నాడు. శ్రీలంక పర్యటనలో భాగంగా భారత్ ఆగస్టు లో మూడు వన్డేలకు కోహ్లీ రెస్ట్ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే బంగ్లాదేశ్ తో స్వదేశంలో జరగబోయే టెస్ట్ సిరీస్ కు కోహ్లీ అందుబాటులో ఉంటాడు.