విశాఖలో కోహ్లీ నో లుక్ సిక్స్.. ఫిదా అయిన డికాక్.. నోరెళ్లబెట్టిన బాష్

విశాఖలో కోహ్లీ నో లుక్ సిక్స్.. ఫిదా అయిన డికాక్.. నోరెళ్లబెట్టిన బాష్

న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‎లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ క్లోహీ భీకర ఫామ్‎లో ఉన్నాడు. పరుగుల వరద పారిస్తూ వింటేజ్ క్లోహీని గుర్తు చేస్తున్నాడు. తొలి రెండు వన్డేల్లో వరుస సెంచరీలతో దుమ్మురేపిన రన్ మెషిన్ విశాఖపట్నం వేదికగా జరిగిన సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డేలోనూ హాఫ్ సెంచరీతో రాణించి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

ఇదిలా ఉంటే.. విశాఖ వన్డేలో కోహ్లీ కొట్టిన ‘నో లుక్ సిక్స్’ షాట్ ఓవరాల్ మ్యాచ్‎కే హైలెట్‎గా నిలిచింది. కార్బిన్ బాష్ వేసిన 34వ ఓవర్ చివరి బంతిని ఫ్రంట్ ఫుట్‎పై నిలబడి వైడ్-ఆన్‎పై సిక్స్ కొట్టాడు కోహ్లీ. షాట్ ఆడిన తర్వాత బౌండరీ వైపు చూడకుండా బౌలర్ బాష్ వైపే చూశాడు. 

►ALSO READ | వన్డే, టెస్ట్, టీ20 ఏది వదల్లే: మూడు ఫార్మాట్లలో శతకొట్టిన 7వ ఇండియన్ క్రికెటర్‎గా జైశ్వాల్ రికార్డ్

కోహ్లీ నో లుక్స్ సిక్స్‎కు స్టేడియంలోని ఆడియన్స్‎తో పాటు సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ కూడా ఆశ్చర్యపోయాడు. బౌలర్ బాష్ అయితే నోరెళ్లబెట్టాడు. ఇక, ఈ మ్యాచులో 45 బంతులు ఆడిన కోహ్లీ 6 ఫోర్లు, మూడు సిక్సర్ల బాది 65 పరుగులతో నాటౌట్‎గా నిలిచాడు. ఈ సిరీస్‎లో 151 సగటు, 117 స్ట్రైక్ రేట్‎తో 302 పరుగులు (రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ) చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ గెల్చుకున్నాడు కోహ్లీ.