ముంబైలో రెస్టారెంట్ ప్రారంభించినున్న కోహ్లీ

ముంబైలో రెస్టారెంట్ ప్రారంభించినున్న కోహ్లీ

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెస్టారెంట్ బిజినెస్ ఎక్స్పాన్షన్ కు రెడీ అయ్యారు. ప్రస్తుతం ఆసియా కప్ 2022 లో బిజీగా ఉన్న విరాట్ ముంబైలో కొత్త రెస్టారెంట్ ప్రారంభించనున్నారు. బాలీవుడ్ లెజెండరీ సింగర్ కిషోర్ కుమార్ కు చెందిన బంగ్లాలో ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని కిషోర్ కుమార్ కుమారుడు అమిత్ కుమార్ స్వయంగా ప్రకటించారు.

ముంబైలోని కిషోర్ కుమార్కు చెందిన బంగ్లాలోని ‘గౌరీ కుంజ్’ పోర్షన్ను విరుష్క దంపతులు ఐదేళ్లపాటు లీజుకు తీసుకొనున్నారు. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ ఇప్పటికే తన జెర్సీ నెంబర్ 18 వచ్చేలా వన్8 కమ్యూన్ పేరుతో ఢిల్లీతో పాటు కోల్ కతా, పూనేలో రెస్ట్రోబార్స్ నడిపిస్తున్నాడు. ఇదే క్రమంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న రెస్టారెంట్కు సంబంధించి లీజు, ఇతర పనులను కోహ్లీ లీగల్ టీం దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. కోహ్లీ ప్రారంభించబోయే రెస్టారెంట్ కు సంబంధించి త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడించే ఛాన్సుంది. బిజినెస్పై ఆసక్తి ఉన్న కోహ్లీ వన్8 బ్రాండ్ పేరుతో ఇప్పటికే క్లాత్, షూస్, హాస్పిటాలిటీ రంగాల్లో పెట్టుబడులు పెట్టాడు. ఇటీవలే వ్రాంగ్ బ్రాండ్ కంపెనీకి చెందిన క్లోతింగ్ అండ్ యాక్ససరీస్ బ్రాండ్లలో కోహ్లీ ఇన్వెస్ట్ చేశారు. 

కిషోర్ కుమార్ ఐకానిక్ బంగ్లాలో ఉన్న పలు చెట్లకు ఆయన పేర్లు పెట్టారు. అంతేకాదు ఆయన వాడిన వింటేజ్ కార్లతో పాటు పలు వస్తువుల్ని ఇక్కడ ఏర్పాటు చేసిన మ్యూజియంలో పెట్టారు. కిషోర్ కుమార్ మరణానంతరం ఆయన కొడుకు తన కుటుంబంతో కలిసి ఇదే బంగ్లాలో ఉంటున్నారు.