సచిన్ రికార్డ్ను  బ్రేక్ చేయనున్న కోహ్లి

సచిన్ రికార్డ్ను  బ్రేక్ చేయనున్న కోహ్లి
  • ఫిబ్రవరి 6న  వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ప్రారంభం

రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తున్న విరాట్ కోహ్లి మరో ఫీట్ కూడా సాధించనున్నాడు. ఫిబ్రవరి 6న అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌-భారత్ వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి వన్డేలో  సచిన్ టెండూల్కర్ రికార్డ్ ను విరాట్ కోహ్లి బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. అందులో 6 పరుగులు చేస్తే చాలు విరాట్ సచిన్ రికార్డును అధిగమిస్తాడు. స్వదేశంలో సచిన్  121 ఇన్నింగ్స్ ఆడి 5వేల రన్స్ చేస్తే ..విరాట్ కేవలం 96 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించనున్నాడు. దీంతో తక్కువ ఇన్నింగ్స్ ఆడి 5 వేల రన్స్ మైలురాయి దాటిన ఆటగాడిగా విరాట్ రికార్డ్ సృష్టించనున్నాడు. భారత క్రికెట్ లో ఒకప్పుడు ఎదురులేని శక్తిగా ఉన్న కోహ్లి ... కొన్ని నెలలుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. కోహ్లికి బీసీసీఐ పెద్దలకు మధ్య కోల్డ్ వార్ లాంటి పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో విరాట్ ఈ రికార్డును బ్రేక్ చేయనుండటం తన ఫ్యాన్స్ కి నిజంగా పండగనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి..

కేసీఆర్ వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉంది...రేవంత్ రెడ్డి