జులై1న ఓటీటీలోకి విరాటపర్వం

జులై1న ఓటీటీలోకి విరాటపర్వం

దగ్గుబాటి రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన మూవీ విరాటపర్వం. వేణు ఉడుగుల దర్శకత్వం వహించారు. సురేష్ ప్రొడక్షన్స్, ఎల్ఎస్వీ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. నక్సలిజం, ప్రేమ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ  స్పందన లభించింది. జూన్ 17న  రిలీజైన  ఈ సినిమా జులై1నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని  నెట్‌ఫ్లిక్స్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. తెలుగు, మలయాళం, తమిళం భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతుందని వెల్లడించింది. థియెటర్ లో రిలీజైన  15 రోజులకే ఈ మూవీ ఓటీటీలోకి వస్తుండడం విశేషం. కాగా ఈ సినిమాలో రవన్నగా రానా, వెన్నెలగా సాయిపల్లవి నటించగా, ప్రియమణి, నందాతా దాస్‌, ఈశ్వరీరావు, జరీనా కీలక పాత్రలు పోషించారు.