థియేటర్స్‌‌‌‌లోనే విరాటపర్వం

థియేటర్స్‌‌‌‌లోనే విరాటపర్వం

బాహుబలి లాంటి భారీ సక్సెస్ తర్వాత కూడా కమర్షియల్ మూవీస్‌‌‌‌కి ఫిక్సైపోకుండా స్ట్రాంగ్‌‌‌‌ కాన్సెప్ట్‌‌‌‌, డిఫరెంట్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ ఉండే సినిమాల్లోనే నటిస్తున్నాడు రానా. త్వరలో తన నుంచి రాబోతున్న చిత్రం విరాటపర్వం. సాయిపల్లవి హీరోయిన్‌‌‌‌గా నటించిన ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకుడు. డి.సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి కలిసి నిర్మించారు.కొవిడ్ వల్ల రెండేళ్లుగా వాయిదాలు పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకి  విడుదలవుతోంది. జులై 1న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు నిన్న ప్రకటించారు. ఓటీటీలో రిలీజ్‌‌‌‌ చేస్తారంటూ ఆమధ్య వార్తలొచ్చాయి. ఆ ప్రచారానికి చెక్ పెడుతూ థియేటర్స్‌‌‌‌లోనే రిలీజ్ అని కన్‌‌‌‌ఫర్మ్ చేశారు నిర్మాతలు. నక్సలిజం బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియమణి, నవీన్ చంద్ర, నందితా దాస్, జరీనా వాహబ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించాడు.