కేన్ విలియమ్సన్‌‌‌ను ఎందుకు ఆడించట్లే?

కేన్ విలియమ్సన్‌‌‌ను ఎందుకు ఆడించట్లే?

చెన్నై: ఐపీఎల్ పద్నాలుగో సీజన్‌ను సన్‌‌రైజర్స్ హైదరాబాద్ పేలవంగా ఆరంభించింది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడి ఫ్యాన్స్‌‌ను నిరాశకు గురి చేసింది. ఈ మ్యాచుల్లో గెలిచే పొజిషన్‌‌లో ఉండి కూడా ఎస్‌ఆర్‌హెచ్ చేజేతులా ఓటమి పాలైందనే చెప్పాలి. ముఖ్యంగా ఆర్సీబీతో మ్యాచ్‌‌లో సులువుగా ఛేధించాల్సిన టార్గెట్‌‌ను వికెట్లు కోల్పోవడంతో చతికిలపడింది. ఎస్‌ఆర్‌‌హెచ్ పెర్ఫామెన్స్‌‌ మీద టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. జట్టు ఓటమికి మిడిలార్డర్‌‌ వైఫల్యమే కారణమన్నాడు. 

కేన్ విలియమ్సన్ రూపంలో అద్భుతమైన మిడిలార్డర్ బ్యాట్స్‌‌మన్ అందుబాటులో ఉన్నా తుది జట్టులో ఆడించడం లేదంటూ ప్రశ్నించాడు. దీని గురించి ఓ సరదా ట్వీట్ చేశాడు. కేన్ విలియమ్సన్ ఫొటోను పోస్ట్ చేసిన వీరూ.. ‘ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు, నేను ఉన్నానుగా’ అనే క్యాప్షన్‌ను రాసుకొచ్చాడు. 

మరో వెటరన్ ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్ కూడా కేన్ విలియమ్సన్ గురించి ట్వీట్ చేశాడు. ‘ఇవాళ్టి ఓటమిని బట్టి చెప్పట్లేదు. కానీ ఎస్ఆర్‌‌హెచ్ టీమ్‌‌లో కేన్ విలియమ్సన్ ఉండి తీరాల్సిందేనని నేనెప్పుడూ చెబుతూనే ఉన్నా. ఏదేమైనా ఆ జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌‌లో కేన్‌‌ను పక్కాగా ఆడించాలె’ అని మంజ్రేకర్ సూచించాడు.