విరూపాక్షకు వందకోట్లు.. మెగా హీరో సాలిడ్ కంబ్యాక్

విరూపాక్షకు వందకోట్లు.. మెగా హీరో సాలిడ్ కంబ్యాక్

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష వందకోట్ల క్లబ్ లో చేరింది. కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో.. కలెక్షన్స్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ మూవీ. ఈ సినిమా సాయి ధరమ్ కెరీర్ లో మొదటి వంద కోట్ల సినిమాగా నిలిచింది.

మిస్టరీ, సస్పెన్స్ అండ్ హారర్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సరికొత్త కాన్సెప్ట్ తో, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో, ఆనెక్స్పెక్టెడ్ ట్విస్ట్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది ఈ సినిమా. అందుకే ఈ సినిమాకి కలెక్షన్ భారీగా వచ్చాయి. ఇందులో భాగంగానే తాజాగా వందకోట్ల క్లబ్ లో చేరింది ఈ సినిమా.

దీంతో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకున్నారు. తమకు ఇంత భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఏ సినిమాకు సీక్వెల్ కూడా ఉండనుంది అనే వార్తలు బలంగా వినిపిసితున్నాయి. సినిమా చివర్లో సీక్వెల్ కోసం లీడ్ కూడా వదిలారు మేకర్స్. దీంతో విరూపాక్ష సీక్వెల్ కోసం ఆడియన్స్ ఇప్పటినుండే ఎదురుచూస్తున్నారు. మరి విరూపాక్ష సీక్వెల్ కూడా ఇదే రేంజ్ లో హిట్ అవుతుందా లేదా చూడాలి మరి.