విరూపాక్ష విజయం గ్యారెంటీ

విరూపాక్ష విజయం గ్యారెంటీ

సాయి ధరమ్‌‌ తేజ్‌‌, సంయుక్తా మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్  ‘విరూపాక్ష’. సుకుమార్ రైటింగ్స్‌‌తో కలిసి బీవీఎస్‌‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ  చిత్రం ఏప్రిల్ 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏలూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సాయి తేజ్ మాట్లాడుతూ ‘సుకుమార్  కథ పంపారంటే  లవ్‌‌స్టోరీ అనుకున్నా. కానీ భయపెట్టే  కథ ఇది. కార్తీక్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. నిర్మాతలు ప్రసాద్, బాపీ నాకు బాగా సపోర్ట్ చేశారు. అజనీష్ బ్యాక్‌‌గ్రౌండ్ స్కోరు ప్లస్ అవుతుంది. కచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది.

ఇక నా గురువు (పవన్ కళ్యాణ్)తో కలిసి సినిమా చేసే అవకాశం ఇచ్చిన సముద్రఖనికి థ్యాంక్స్. కాలర్ ఎగరేసేలా ఆ సినిమా ఉంటుంది’ అన్నాడు. ‘ప్రేమతో సినిమా చేశాం. నందిని పాత్రలో ఆకట్టుకుంటా’ అంది సంయుక్త. సుకుమార్ మాట్లాడుతూ ‘సాయి తేజ్‌‌కి  నటుడిగా ఇది పునర్జన్మలాంటిది. ప్రమాదం జరిగిన తరువాత సాయి నటించిన మొదటి సినిమా. పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’ అన్నారు. ‘ఎన్టీఆర్ వాయిస్‌‌తో ఈ సినిమాకు పవర్ వచ్చింది. టీజర్‌‌‌‌ను చూసి పవన్  కళ్యాణ్ మెచ్చుకున్నారు. ఇది సాయి కెరీర్‌‌‌‌కి పాథ్ బ్రేకింగ్ సినిమా అవుతుంది’ అన్నాడు కార్తీక్. నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు, మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌‌నాథ్, లిరిసిస్ట్ అనంత శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.