ఆటమ్‌‌ సోలార్‌‌‌‌కు ప్రెస్టీజియస్ అవార్డ్

ఆటమ్‌‌ సోలార్‌‌‌‌కు ప్రెస్టీజియస్ అవార్డ్
  • రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్‌‌‌‌లో చేసిన కృషికి గాను ఈఈఎఫ్‌‌ అవార్డ్‌‌ పొందిన  కంపెనీ 

హైదరాబాద్‌‌, వెలుగు:  రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్‌‌‌‌లో  చేసిన విశేష కృషికి గాను ‘ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌‌మెంట్ ఫౌండేషన్ (ఈఈఎఫ్‌‌) గ్లోబల్ సస్టైనబిలిటీ’ అవార్డ్‌‌ ను  గోల్డ్ కేటగిరిలో   విశాక ఇండస్ట్రీస్‌‌కు చెందిన ఆటమ్ సోలార్  గెలుచుకుంది. 

ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌‌లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో  కంపెనీ సీనియర్ లీడర్లు ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు.  సరికొత్త సోలార్ టెక్నాలజీ, పర్యావరణానికి మేలు చేయడంలో,  సస్టయినబుల్ డెవలప్‌‌మెంట్‌‌లో ఆటమ్ సోలార్ నిబద్ధతను ఈ అవార్డు గుర్తిస్తోంది. ఆటమ్ సోలార్ రూఫ్‌‌లు కార్బన్ ఎమిషన్స్‌‌ తగ్గించడంలో చేసిన కృషిని జ్యూరీ ప్రశంసించింది. 

ఆటమ్ ఇంటిగ్రేటెడ్ సోలార్ రూఫ్‌‌లు  సంప్రదాయ రూఫ్‌‌లు మాదిరి పనిచేయడంతో పాటు క్లీన్, రెన్యూవబుల్ కరెంట్‌‌ను  ఉత్పత్తి  చేస్తాయి.  వీటి  ద్వారా ఇప్పటివరకు  లక్ష టన్నుల కంటే ఎక్కువ కార్బన్ ఎమిషన్స్‌‌ తగ్గాయి.  

రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్‌‌‌‌లో  టాప్‌‌లో  ఆటమ్ సోలార్‌‌‌‌ ఉందనే విషయం ఈ అవార్డ్‌‌ ద్వారా తెలుస్తోందని  విశాక ఇండస్ట్రీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గడ్డం వంశీ కృష్ణ  అన్నారు.  సస్టయినబుల్‌‌ డెవలప్‌‌మెంట్‌‌కు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.   ఆటమ్ సోలార్ ప్యానెల్‌‌లు ఐఈసీ  ప్రమాణాలను పాటిస్తున్నాయి. వీటిని  అన్ని రకాల సోలార్ ఇన్‌‌స్టలేషన్‌‌లకు  వాడుకోవచ్చు. 

ఆటమ్    ఇండియాతో పాటు అమెరికా, దక్షిణాఫ్రికాలలోనూ పేటెంట్‌‌లు  పొందింది.   ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్స్‌‌ను చేరుకోవడంలో ఆటమ్ కీలకంగా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. కాగా, విశాక ఇండస్ట్రీస్ సిమెంట్‌‌  రూఫ్‌‌లు, ఫైబర్‌‌‌‌ సిమెంట్‌‌ బోర్డుల తయారీలో ఉంది. మార్కెట్‌‌లో లిస్టింగ్ అయిన ఈ కంపెనీ టర్నోవర్ రూ.1,400 కోట్ల దగ్గర ఉంది. వీనెక్స్ట్‌‌, ఆటమ్‌‌ సోలార్‌‌‌‌, వండర్‌‌‌‌ యార్న్‌‌, ఆటమ్ ఛార్జ్ కంపెనీ పాపులర్  బ్రాండ్‌‌లు.